క్యూరియాసిటీ పెంచిన ‘అలిపిరి’ ట్రైలర్

యూనిక్ ప్రమోషనల్ కంటెంట్ తో అందరి ద్రుష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. ఈ సినిమా నుండి ఇప్పటివరకూ విడుదలైన టీజర్, మా తిరుపతి పాట వైరల్ గా మారి సినిమా పై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు. రెండు నిమిషాల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

లవ్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ట్రైలర్ లో అద్భుతంగా ప్రజంట్ చేశారు. ”కొంచెం డబ్బులు కావాలన్నా.. తిరుమలలో షాపు వేలం పాటకి వస్తోంది” అని హీరో చెప్పిన డైలాగ్ తో మొదలైన ట్రైలర్.. ఆద్యంతం ఒక మనీ బ్యాగ్ మిస్సింగ్ చుట్టూ ఆసక్తికరమైన మలుపులతో తిరగడం క్యూరియాసిటీని పెంచింది. అంతేకాదు.. అఖండ, కార్తికేయ, కాంతార తరహాలో ‘తిరుపతి’ నేపధ్యంలో అలిపిరి కథలో కూడా ఒక డివైన్ ఎలిమెంట్ కూడా వుందని అర్ధమౌతోంది.

ట్రైలర్ లో రావణ్ నిట్టూరు పెర్ఫార్మెన్స్ ప్రామెసింగా వుంది. ఎక్స్ ప్రెషన్స్ చక్కగా పలికించాడు. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ కూడా బావుంది. నూతన దర్శకుడు ఆనంద్ జె బ్రిలియన్స్ ట్రైలర్ లో కనిపించింది. తొలి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. డి. జె కె సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఫణికళ్యాణ్ నేపధ్య సంగీతం రాబరీ డ్రామాని ఎలివేట్ చేసింది.

రాబరీ డ్రామాలుగా వచ్చిన రాజరాజ చోర, బ్రోచేవారెవరురా, స్వామి రారా చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి. ‘ఆలిపిరికి అల్లంత దూరంలో’ ట్రైలర్ చూస్తుంటే రాబరీ డ్రామా తో పాటు ఒక డివైన్ ఎలిమెంట్ కూడా ప్రేక్షకులు చూడబోతున్నారనే నమ్మకాన్ని కలిగించింది.

కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎక్సయింటింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో క్యూరియాసిటీని పెంచిన ఈ చిత్రం నవంబర్ 18న థియేటర్స్ లో విడుదలౌతోంది.