సినిమా తీయడమో హక్కులు కొనడమో కాదు ముఖ్యం. సరైన టైమింగ్ తో రిలీజ్ చేసుకోవడం అన్నిటి కన్నా పెద్ద సవాల్. అనవసరమైన పోటీకి దిగి ఓపెనింగ్స్ ని పంచుకుని లేనిపోని బీరాలు పోవడం కన్నా తెలివైన నిర్ణయాలతో లాభాలు అందుకోవడం ఒక కళ. అందులో దిల్ రాజు మాస్టర్ డిగ్రీనే చేశారు. దానికి తాజా ఉదాహరణ లవ్ టుడే. రెండు వారాల క్రితం తమిళంలో రిలీజైన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్టు.
ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా కేవలం కంటెంట్ తో బ్రహ్మాండమైన ఆదరణ దక్కించుకుంది. కుర్రకారుతోనే అక్కడి థియేటర్లు కళకళలాడుతున్నాయి. గతంలో ఇలాగే విజయ్ సేతుపతి 96 సక్సెస్ చూసి రీమేక్ రైట్స్ కొనేసి చేతులు కాల్చుకున్న దిల్ రాజు ఈసారి మళ్ళీ అలాంటి పొరపాటు చేయకుండా లవ్ టుడేని శుభ్రంగా డబ్బింగ్ చేసి ఈ నెల 18న విడుదల చేస్తున్నారు. ఆ రోజు చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేకపోవడం దీనికి గోల్డెన్ ఛాన్స్ కానుంది.
గాలోడు, మసూద, అలిపిరికి అల్లంత దూరంలో, ప్రేమదేశం, ప్లే, సీతారామపురంలో ఒక ప్రేమజంట ఇవన్నీ ఏ హైపూ లేని చిన్న చిత్రాలే. బ్రహ్మాండమైన టాక్ వస్తే తప్ప గట్టెక్కలేనివి. పైగా వేటికీ పెద్ద బ్యానర్లు అండగా లేవు. సరిపడా థియేటర్లు షోలు పడినా గొప్పే అనుకోవాలి. కానీ లవ్ టుడేకి ఆ సమస్య లేదు. దిల్ రాజు నెట్ వర్క్ దీనికి బాగా ఉపయోగపడుతుంది.
కూసింత ప్రమోషన్ గట్టిగా చేస్తే చాలు దానికి మౌత్ టాక్ తోడై కలెక్షన్ల ప్రవాహం కురుస్తుంది. ఎలాగూ యశోద రెండో వారానికి నెమ్మదిస్తుంది. ఆ గ్యాప్ ని వాడుకోవడానికి లవ్ టుడేకి ఇదే మంచి ఛాన్స్. ఆపై వారం కూడా అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం తప్ప చెప్పుకోదగ్గ రిలీజులు లేవు. దసరా తర్వాత ఒకరకమైన స్లంప్ లో ఉన్న బాక్సాఫీస్ కు ఇప్పుడు తగినంత ఆక్సిజన్ ఇచ్చే హిట్లు కావాలి. ముఖ్యంగా వీక్ డేస్ లో జనాలు బాగా పల్చబడిపోయిన హాళ్లు మళ్ళీ నిండాలంటే హిట్లు పడాల్సిందే.
This post was last modified on November 12, 2022 12:46 pm
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…
ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది.…
ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…