అల్లు అర్జున్ పుష్ప 2 సెట్స్ పైకి వచ్చేసింది. మొన్నీ మధ్యే బన్నీ లేకుండా ఓ టెస్ట్ షూట్ చేసిన యూనిట్ తాజాగా ఫస్ట్ షెడ్యుల్ మొదలు పెట్టారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో పుష్ప ది రూల్ షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ షూట్ లో బన్నీ లేడు. ఇంకా బన్నీ తన మాస్ గెటప్ తో పుష్ప 2 సెట్స్ పైకి రాలేదు. ఇప్పటి వరకూ కేవలం లుక్ టెస్ట్ లో మాత్రమే బన్నీ పాల్గొన్నాడు.
రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం బన్నీ లేకుండా కొన్ని యాక్షన్ ఎపిసోడ్ గ్లిమ్స్ తీస్తున్నారు. ఈ నెల 15 లేదా 16 బన్నీ షూట్ లో పాల్గొనబోతున్నాడని సమాచారం. అక్కడి నుండి పుష్ప 2 షూట్ శరవేగంగా జరుగుతుంది. ఎక్కువ బ్రేకులు లేకుండా సుకుమార్ షూట్ పక్కా గా ప్లాన్ చేసుకుంటున్నాడట. హైదరాబాద్ లో షెడ్యుల్ తర్వాత యూనిట్ బ్యాంకాక్ వెళ్లనుంది. ఆ తర్వాత జపాన్ లో కూడా ఓ షెడ్యుల్ అనుకుంటున్నారు. తమిళ్ నాడు, మారేడుమిల్లి లోకేషన్స్ కూడా చూస్తున్నారు.
ఏదేమైనా సుకుమార్ వర్కింగ్ స్టైల్ కాస్త స్లోనే. తెలుగులో రాజమౌళి తర్వాత సినిమాకు అంత టైం తీసుకునేది సుక్కునే. చివరి నిమిషం వరకు చెక్కుతూనే ఉంటాడనే రిమార్క్ ఉంది. అందులో భాగంగానే పుష్ప 2 ప్రీ ప్రొడక్షన్ కోసమే చాలా నెలలు తీసుకున్నాడు. ఈసారి నార్త్ ఆడియన్స్ ను కూడా దృష్టిలో పెట్టుకుని సుకుమార్ పుష్ప పార్ట్ 2 తీస్తున్నాడు అందుకే మరింత ఆలస్యంగా వర్క్ జరుగుతుంది. వచ్చే ఏడాది చివర్లో లేదా 2024 సంక్రాంతి కి సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
This post was last modified on November 12, 2022 9:40 am
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు…
తాజాగా మరో రాజ్యసభ సీటుకు సంబంధించి ఎన్నికలకు రంగం రెడీ అయింది. వైసీపీ నాయకుడు, కీలక నేతల వేణుంబాకం విజయ…