నిన్న విడుదలైన యశోదకు మంచి స్పందనే దక్కుతోంది. ఉదయం ఓ మోస్తరు ఓపెనింగ్స్ తో ప్రారంభమైనప్పటికీ సాయంత్రానికి పికప్ కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో సెకండ్ షోలకు సైతం ఆక్యుపెన్సీలు బాగున్నాయి. సోలో హీరోయిన్ గా సమంతా ఇమేజ్ ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో ఉందో మరోసారి ఋజువవుతోంది. మాములుగా డ్రైగా నడిచే నవంబర్ నెలలో పాజిటివ్ టాక్ వచ్చిన ఊర్వశివో రాక్షసివో సైతం జనాన్ని థియేటర్ల దాకా రప్పించలేకపోయింది.
ఈ నేపథ్యంలో రెండు వారాలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్ కి జోష్ నింపే బాధ్యత యశోద మీదే పడింది. దానికి తగ్గట్టే రెస్పాన్స్ కనిపిస్తోంది. సరే ఇది హిట్టా కాదా అని తేలడానికి ఇంకొక్క నాలుగైదు రోజులు పడుతుంది కానీ ఈ కథకు సంబంధించిన ఒక అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 2018లో లెవెల్ 16 అనే ఇంగ్లీష్ మూవీ ఒకటొచ్చింది. ఇది అందమైన అమ్మాయిల చర్మాలు వలిచి వాటిని బిలియనీర్లకు అమ్మేసి వాళ్ళ శరీరాలకు తిరిగి అతికించే ముఠా కథ.
ఆది తెలియకుండా డబ్బు కోసం అక్కడికి వచ్చిన ఇద్దరు హీరోయిన్లు అసలు నిజం తెలిశాక అందులో నుంచి బయటపడేందుకు పోరాటం చేస్తారు. యశోద లాగే ఇందులోనూ బయట ప్రపంచంతో సంబంధం లేని ఒక హాస్పిటల్ లాంటి సెటప్ గట్రా ఉంటాయి. ఈ హాలీవుడ్ మూవీలో సరోగసి లాంటివేమీ ఉండవు కానీ టెంపో పరంగా చూసుకుంటే స్ఫూర్తి తీసుకున్న మాట నిజమే అనిపిస్తుంది.
అయితే లెవెల్ 16 పెద్దగా విజయం సాధించలేదు. ఇది థియేటర్ రిలీజ్ కాదు. 2018లో బెర్లిన్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించాక 2019లో సిబిసి టీవీ ఛానల్ లో శాటిలైట్ ప్రీమియర్ వేశారు. రేటింగ్స్ కూడా అంతగా లేవు. అంటే ఫ్లాప్ కిందే లెక్క. ఇంటరెస్టింగ్ పాయింట్ ఉన్నప్పటికీ దాన్ని దర్శకుడు సరైన రీతిలో మలచలేకపోయాడు. దీంతో దెబ్బ తింది. యశోద మరీ అంత బ్యాడ్ కాకుండా దర్శకులు హరి అండ్ హరీష్ లు స్క్రీన్ ప్లే బాగానే సెట్ చేసుకున్నారు. కమర్షియల్ పరంగా పెద్ద రేంజ్ కు వెళ్తేనే సామ్ కష్టానికి తగ్గ ఫలితం దక్కినట్టు.
This post was last modified on November 12, 2022 9:12 am
దాయాదీ దేశాలు భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధం మొదలైపోయిందనే చెప్పాలి. ఈ మేరకు గురువారం యుద్ధం జరుగుతున్న తీరుకు…
ఓ వైపు పాకిస్తాన్ కుట్రపూరిత వ్యూహాలు, మరోవైపు ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాద దాడులు… వెరసి నిత్యం భారత…
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా.. ఒకప్పుడు చాలామంది హీరోలు, హీరోయిన్లు ఈ మాట చెప్పేవారు. ఐతే గతంలో సినిమాల్లోకి రావాలంటే…
వైసీపీ నాయకులపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు పడ్డాయి. జైలు-బెయిలు అంటూ.. నాయకులు, అప్పట్లో వైసీపీకి అనుకూలంగా…
ఏపీని కుదిపేస్తున్న లిక్కర్ కుంభకోణం వ్యవహారంపై ఇప్పుడు కేంద్రం పరిధిలోని ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. ఏపీ మద్యం…
ఇండస్ట్రీలో అంతే. ఒక్క హిట్ జాతకాలను మార్చేస్తుంది. ఒక్క ఫ్లాప్ ఎక్కడికో కిందకు తీసుకెళ్తుంది. డ్రాగన్ రూపంలో సూపర్ సక్సెస్…