ఒకప్పుడు సినిమాకి హిట్ టాక్ వస్తే దానికి తగ్గట్టే కలక్షన్స్ కూడా అదే తరహాలో వచ్చేవి. దీంతో నిర్మాత కి అలాగే కొన్న డిస్ట్రిబ్యూటర్స్ లాభాలు అందుకునే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఇప్పుడు హిట్ టాక్ వచ్చినా , పాజిటివ్ రివ్యూ పడినా లాభం లేకుండా పోతుంది. కొన్ని సినిమాలు బాగున్నా ప్రేక్షకులు ఇగ్నోర్ చేస్తుండటమే దీనికి కారణంగా కనిపిస్తుంది.
కోవిడ్ తర్వాత అందరి మైండ్ సెట్ మారింది. సినిమా చూసే విధానం మారిపోయింది. ఏదో అద్భుతం అంటే తప్ప థియేటర్స్ కి కదలని పరిస్థితి కనిపిస్తుంది. ఇటివల వచ్చిన డబ్బింగ్ సినిమా కాంతార నే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమాలో మెస్మరైజ్ చేసే కంటెంట్ ఉండటంతో చూసిన వారంతా ఇది థియేటర్స్ లోనే ఎక్స్ పీరియన్స్ చేయాల్సిన సినిమా అంటూ ప్రచారం చేశారు. దీంతో తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దీంతో సినిమా మంచి వసూళ్ళు సాదించి తెలుగులో రీసెంట్ టాప్ గ్రాసర్ లిస్టు లో చేరింది.
ఇక ఈ మధ్య నిర్మాతలు , డిస్ట్రిబ్యూటర్స్ ఇద్దరూ కలిస్తే ఎక్కువగా మాట్లాడుకుంటున్న సినిమాలు రెండే రెండు. ఒకటి స్వాతి ముత్యం ఇంకొకటి ఊర్వశివో రాక్షసివో. ఈ రెండు సినిమాలో మంచి ఫన్ ఉంది. టికెట్టు కొన్న ప్రేక్షకుడు హిలేరియస్ గా నవ్వుకునే కంటెంట్ ఉంది. రివ్యూలలో కూడా అదే రాశారు. కానీ కలెక్షన్స్ లేవు. స్వాతి ముత్యం కి థియేటర్స్ లో కరెంట్ బిల్స్ కలెక్షన్స్ కూడా రాలేదు. ఇక ఈ మధ్యే ఓటీటీ లో రిలీజైన ఈ సినిమాను బాగానే చూస్తున్నారు.
ఇక ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతున్న ఊర్వశివో రాక్షసివో కూడా చూసిన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ చాలా ఏరియాల్లో ఈ సినిమాకు టికెట్లు తెగడం లేదు. స్వయంగా బన్నీ వచ్చి సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసినా ప్రయోజనం కనిపించలేదు. ఇందులో కూడా కావాల్సినంత హిలేరియస్ ఎంటర్టైన్ మెంట్ ఉంది. వెన్నెల కిషోర్ , సునీల్ ట్రాక్ బాగా పేలింది. కానీ ఆ కామెడీ కలెక్షన్స్ తెచ్చిపెట్టలేక పోతుంది. ఈ రెండు సినిమాలు థియేటర్స్ లో ఆడకపోవడంతో కామెడీ ఫుల్లు , కలెక్షన్స్ నిల్లు అనే రిమార్క్ తెచ్చుకున్నాయి. బహుశా ఈ హీరోల సినిమాలకు టికెట్టు కొని చూడటం కంటే ఓటీటీ లో చూస్తే పోలే అనుకున్నారేమో ప్రేక్షకులు.
This post was last modified on November 11, 2022 7:33 pm
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…