జనం అసలే థియేటర్లకు రావడం తగ్గించారు. ఏదో విజువల్ గ్రాండియరో లేదా అదిరిపోయే కంటెంటో ఉంటే తప్ప టికెట్లు కొని ఏం చూస్తాంలే ఇంట్లోనే ఉందామనే ధోరణి విపరీతంగా పెరిగిపోయింది. ఇదే విషయంగా మూడు నెలల క్రితం నిర్మాతల క్రితం స్ట్రైక్ చేసి మరీ చర్చోపచర్చలు చేశారు. నష్టం వస్తున్నా సరే షూటింగులు ఆపి నిర్మాతలు దానికి సహకరించారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఓటిటికి సంబంధించి ఎనిమిది వారాల గ్యాప్ ని తప్పనిసరి చేశారు. కానీ ఒకవేళ దాన్ని పాటించకపోతే ఉండే పరిణామాలు మాత్రం బయటికి చెప్పలేదు.
కట్ చేస్తే గ్రౌండ్ రియాలిటీ సీన్ వేరేలా ఉంది. పట్టుమని ఇరవై రోజులు దాటడం ఆలస్యం వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ పేరుతో కొత్త సినిమాలు స్మార్ట్ స్క్రీన్ పైకి వచ్చేస్తున్నాయి. హఠాత్తుగా ఊడిపడ్డట్టు ఓరి దేవుడా ప్రకటన ఉదయం ఇచ్చేసి పదకొండో తేదీ నుంచే స్ట్రీమింగ్ అంటూ సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేశారు. ఓటిటి పార్ట్ నర్ ఆహా అని తెలుసు కానీ మరీ ఇంత త్వరగా ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. గతంలో స్వాతిముత్యంని కూడా ఇదే తరహాలో దీపావళి కానుకంటూ నాలుగో వారం రాకుండానే ఆడియన్స్ ఇళ్లకు పంపించారు. నాగార్జున ది ఘోస్ట్ ది సైతం అదే కథ.
డీసెంట్ టాక్ తెచ్చుకున్న వాటిని ఇలా త్వరపడి ఓటిటిలో వేస్తే థియేటర్ రిలీజ్ టైంలో యావరేజ్ అనే మాట విన్న జనాలు థియేటర్ కు ఎందుకు వస్తారు. అదేదో పది రోజులు ఆగితే హ్యాపీగా కాలు కదలకుండా చూడొచ్చు కదాని రిలాక్స్ అవుతారు. గాడ్ ఫాదర్ కూడా ఎర్లీ స్ట్రీమింగ్ కి ప్రయత్నించి నెట్ ఫ్లిక్స్ అదనపు మొత్తం ఇవ్వడానికి ఒప్పుకోలేదన్న టాక్ కూడా ఉంది. అందుకే నలభై రోజుల తర్వాత ఈ 18న వస్తోంది. ఏది ఏమైనా ఈ ఇష్యూ ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. లేకపోతే ఆడియన్స్ లో నిర్లిప్తత ఇంకా పెరిగిపోయి ఇకపై ఓపెనింగ్స్ కి గండి పడుతుంది.
This post was last modified on November 11, 2022 3:42 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…