టాలీవుడ్ యువ కథానాయకుడు ‘అర్జున్ రెడ్డి’ అనే తెలుగు సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు. అప్పుడు అతడికి వచ్చిన ఫాలోయింగ్ చూసి సరైన సినిమాలు పడితే పాన్ ఇండియ స్థాయిలో పెద్ద స్టార్ అయిపోతాడని అంచనా వేశారు సినీ పండితులు. కానీ గీత గోవిందం, ట్యాక్సీవాలా సినిమాల వరకు అతడి బండి బాగానే నడిచింది కానీ.. తర్వాత ట్రాక్ తప్పాడు.
డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి డిజాస్టర్లు అతణ్ని వెనక్కి లాగాయి. ఇక ఈ ఏడాది ‘లైగర్’ అడిఎంత పెద్ద షాకిచ్చిందో తెలిసిందే. ఈ సినిమాతో ఇండియాను షేక్ చేస్తాను అన్నవాడు కాస్తా తనే షేక్ అయిపోయాడు. తెలుగులోనే కనీస స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఈ చిత్రం.. ఇతర భాషల్లో మరింత పూర్‌గా పెర్ఫామ్ చేసింది. ఈ సినిమా విజయ్ కెరీర్ మీద బాగానే నెగెటివ్ ఎఫెక్ట్ చూపించినట్లు కనిపిస్తోంది.
ఐతే ఇలాంటి టైంలో విజయ్ గురించి ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది. అతను ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్-2లో లీడ్ రోల్ చేయబోతున్నాడట. పార్ట్-1లో శివ కథను చూపించిన దర్శకుడు అయాన్ ముఖర్జీ రెండో భాగంలో ‘దేవ్’ కథను చూపించనున్న సంగతి తెలిసిందే. పార్ట్-1లోనే పార్ట్-2 గురించి హింట్ ఇచ్చారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రను ఎవరు చేస్తారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ పాత్రకు విజయ్ దేవరకొండ పేరును పరిశీలిస్తున్నట్లుగా ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.
కానీ ఏ రకంగా చూసినా ఇది నిజం అయ్యే సంకేతాలు కనిపించడం లేదు. రణబీర్‌కు తండ్రిగా అతడి కంటే చిన్నవాడు, యంగ్ హీరో అయిన విజయ్‌ని ఎంచుకుంటారంటే నమ్మలేం. దీనికి తోడు ‘లైగర్’ రిజల్ట్ చూశాక ఇలాంటి భారీ చిత్రానికి అతడిని తీసుకోవడం సాహసమే అవుతుంది. అందులోనూ ‘లైగర్’ చిత్రంలో నిర్మాణ భాగస్వామి అయి కరణ్ జోహార్ గట్టి దెబ్బ తిన్నాడు. ఇలా ఏ యాంగిల్‌లో చూసినా విజయ్‌ను ఇంత భారీ చిత్రంలో లీడ్ రోల్ కోసం ఎంచుకోవడం కష్టమే.
This post was last modified on November 11, 2022 1:46 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…