టి20 ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియన్ టీమ్ అత్యంత దారుణంగా ఓటమి చెందడం క్రికెట్ అభిమానులు జీరించుకోలేకపోతున్నారు. పోరాడి ఓడితే కొంత ఊరట దక్కేది కానీ అసలు వికెట్టే కోల్పోకుండా ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ చేసిన ఊచకోత కొన్నాళ్ల పాటు పీడకలగా వచ్చేలా ఉంది. ఇది గెలుస్తుందనే ధీమాతోనే ఇవాళ కోట్లాది జనం టీవీలకు అతుక్కుపోయారు. కొన్ని కార్పొరేట్ కంపెనీల్లో ఏకంగా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి ఉద్యోగుల కోసం లైవ్ టెలికాస్ట్ పెట్టారు. అంతగా ఇండియన్ టీమ్ లవర్స్ దీని కోసం ఎదురు చూశారన్న మాట. అనుకున్నది ఒక్కటి అయినది ఇంకొక్కటిలా మొత్తంగా బోల్తా కొట్టేసింది.
దీనికి యశోదకు లింక్ ఏంటనే డౌట్ వస్తోంది కదూ. అక్కడికే వద్దాం. ఒకవేళ రోహిత్ సేన కనక గెలిచి ఉంటే ఆదివారం రోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడాల్సి వచ్చేది. అదే జరిగితే దేశం మొత్తం కర్ఫ్యూ లాంటి వాతావరణం ఏర్పడి ఎవరూ బయటికి వచ్చే సీన్ ఉండదు. ఇక థియేటర్ల గురించి చెప్పేదేముంది. అలాంటప్పుడు కీలకమైన సండే వసూళ్లకు పెద్ద గండి పడేది. ముఖ్యంగా దీనివల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది సమంతా యశోదనే. ఎందుకంటే ఆ రోజు మ్యాచ్ మొదలయ్యేది మధ్యాన్నం నుంచి. సాయంత్రానికి పూర్తయినా అప్పటికప్పుడు పబ్లిక్ సినిమాలకు పరుగులు పెట్టరుగా
మొత్తానికి మ్యాచ్ పోవడం బాక్సాఫీస్ కి ఊరటనిస్తోంది. ఎందుకంటే గ్రూప్ మ్యాచులు జరుగుతున్నప్పుడు ఇండియా పాక్ తలపడిన సందర్భంలో కలెక్షన్లు బాగా ప్రభావితం చెందాయి. ఇప్పుడదే సీన్ రిపీట్ అవుతుందేమో అనుకుంటే ఎట్టకేలకు ఆ గండం అయితే తప్పింది. ఇది ఒకరకంగా సంతోషించాల్సిన విషయమే అయినా మూవీ కన్నా దేశం పరువు ముఖ్యం కాబట్టి ఓటమి వల్ల కలిగిన బాధ అంత సులభంగా తగ్గేది కాదు. యశోదతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు రిలీజవుతున్నా వాటికి పెద్ద హైప్ లేదు. ఉన్నంతలో హాలీవుడ్ మూవీ వాకండ ఫరెవర్ కే ఎక్కువ హైప్ ఉంది.
This post was last modified on November 10, 2022 9:51 pm
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…