Movie News

మలైకా భలే ఫూల్ చేసిందిగా..

దశాబ్దంన్నర పాటు వైవాహిక జీవితం సాగించాక.. ఇద్దరు పిల్లలు పెరిగి పెద్దవాళ్లవుతున్న టైంలో సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ నుంచి విడిపోయింది మలైకా అరోరా. ఆమె విడాకులు తీసుకోవడం సర్ప్రైజ్ ఏమీ కాదు కానీ.. తనకంటే పన్నెండేళ్లు చిన్నవాడైన యువ కథానాయకుడు అర్జున్ కపూర్‌తో ఆమె కొత్త బంధం మొదలుపెట్టడం మాత్రం షాకింగే. అసలు అర్జున్‌తో ప్రేమలో పడటం వల్లే అర్బాజ్ నుంచి ఆమె వీడిపోయిందన్నది బాలీవుడ్ వర్గా మాట.

ముందు వీళ్లిద్దరూ తమ బంధాన్ని బయటపెట్టడానికి ఇష్టపడలేదు. ఆ బంధం కొంత కాలం పాటు దాపరికాలతోనే సాగింది. కానీ తర్వాత ఇద్దరూ తమ రిలేషన్ గురించి ఓపెన్ అయిపోయారు. కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టారు. వీరి పెళ్లి గురించి.. అలాగే బ్రేకప్ గురించి వివిధ సందర్భాల్లో రకరకాల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటిదాకా ఏవీ నిజం కాలేదు.

కట్ చేస్తే ఇప్పుడు అర్జున్‌తో మలైకా పెళ్లి బంధానికి సిద్ధమైందనే ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతోంది. అందుక్కారణం ఆమె తాజాగా పెట్టిన ఒక పోస్టో. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘నేను అంగీకారం తెలిపాను’’ (I said Yes) అనే కామెంట్‌తో మలైకా ఒక పోస్టు పెట్టింది. పాశ్చాత్య దేశాల్లో ప్రేమను వెల్లడించడానికి మహిళలు ఇదే మెసేజ్‌ను ఉపయోగిస్తారు. మలైకా ఉద్దేశం అర్జున్‌ పెళ్లి ప్రతిపాదనను తాను అంగీకరించినట్లు చెప్పడమే అని.. కాబట్టి త్వరలోనే వీరి పెళ్లి వేడుకను చూడబోతున్నామని నెటిజన్లు వ్యాఖ్యానించేస్తున్నారు. కొందరు పీఆర్వోలు, మీడియా వాళ్లు కూడా ఈ మేరకు వార్తలు ఇచ్చేస్తున్నారు. కానీ అసలు విషయం అది కాదు.

మలైకా హాట్ స్టార్ కోసం ‘మూవింగ్ ఇన్ విత్ మలైకా’ అనే షో చేయబోతోంది. ఈ షోకు ఆమె అంగీకారం తెలిపిందట. ఆ విషయాన్ని నేరుగా చెప్పకుండా పబ్లిసిటీ కోసం ఆ ఒక్క కామెంట్ మాత్రమే పోస్ట్ చేసి లేని పెళ్లి గురించి రచ్చకు అవకాశమిచ్చింది. అందరినీ ఫూల్స్‌ని చేశాక చావు కబురు చల్లగా చెప్పింది.

This post was last modified on November 10, 2022 6:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

2 hours ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

10 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

13 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

14 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

14 hours ago