వివాదాల మీద సినిమాలు తీస్తే లాభపడతామనో లేక మనోభావాలతో ముడిపడిన అంశాలను తీసుకుంటే త్వరగా ఆడియన్స్ ని ఆకర్షిస్తామనే లెక్కనో ఏమో కానీ ది కాశ్మీర్ ఫైల్స్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇలాంటివి మరిన్ని రావడానికి స్ఫూర్తినిస్తోంది. కాశ్మీర్ లోయలో పండిట్ల ఊచకోత గురించి దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చూపించిన తీరు డాక్యుమెంటరీ తరహాలో ఉన్నా సరే ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయిపోయి ఏకంగా మూడవ వందల కోట్ల వసూళ్లు గుప్పించింది. అందులో చాలా అవాస్తవాలు చూపించారనే కామెంట్స్ వచ్చినప్పటికీ ప్రభుత్వ అండదండలతో నిర్విరామంగా కొనసాగింది.
ఇప్పుడీ వరసలో మరో మూవీ రానుంది. అదే ది కేరళ స్టోరీ. వారం క్రితమే టీజర్ రిలీజ్ చేశారు. ముందుగా దీని గురించి ఎవరికీ తెలియదు, పట్టించుకోలేదు. కానీ చాలా సున్నితమైన అంశాలను ఆ చిత్రంలో సృశించారనే టాక్ బయటికి రావడంతో ఒక్కసారిగా ఇది కాంట్రావర్సీకి బిందువుగా మారుతోంది. దర్శకులు శ్రీ సుదీప్తో సేన్ ఆ వీడియో ద్వారా కేరళ రాష్ట్రంలో 32 వేల మహిళలు మతం మార్చబడి ఐఎస్ఐఎస్ తీవ్రవాద ముఠా చేరేలా ప్రేరేపింపబడ్డారని చూపించారు. సిరియా యెమెన్ ఎడారుల్లో వీళ్లందరినీ సజీవంగా దహనం చేశారని కూడా ఒక లేడీ క్యారెక్టర్ ద్వారా చెప్పించారు.
నిజానికి టీజర్ లో బుర్ఖా వేసుకున్న ఒక అమ్మాయి మాట్లాడ్డం తప్ప ఏమి లేదు. కాకపోతే కేరళలో పరిస్థితి చాలా దారుణంగా ఉందనేలా చెప్పించిన తీరు ఇప్పుడీ రచ్చకు కారణమవుతోంది. దీంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు దీన్ని నిషేదించాలని బిజెపికి లేఖలు రాస్తున్నారు. గాడ్స్ ఓన్ ల్యాండ్ గా పేరున్న కేరళ పేరుని చెడగొట్టేందుకే పూనుకున్నారని ప్రజా మద్దతు కూడగడుతున్నారు. విపుల్ అమృత్ లాల్ షా లాంటి సీనియర్ నిర్మాత కం డైరెక్టర్ ఈ ప్రాజెక్టు వెనుక ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. మరి కాశ్మీర్ ఫైల్స్ లాగా ఇది బయటికి వస్తుందా లేక ఆగిపోతుందా వేచి చూడాలి.
This post was last modified on November 10, 2022 9:52 pm
మాములుగా స్టార్ హీరోల విషయంలో కంబ్యాక్, సెకండ్ ఇన్నింగ్స్ పదాలు సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు లేదా…
బాక్సాఫీస్ కు ఈ ఏడాది సంక్రాంతి, ఉగాది తర్వాత అత్యంత కీలకమైన సీజన్ ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం. లాంగ్…
నితిన్ లేటెస్ట్ రిలీజ్ రాబిన్ హుడ్ బాక్సాఫీస్ ఫలితం చేదుగా వచ్చేసింది. ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేసినా, డేవిడ్ వార్నర్…
టాలీవుడ్ శ్రీవల్లిగా అభిమానులను సంపాదించుకున్న రష్మిక మందన్న మూడు బ్లాక్ బస్టర్లు యానిమల్, పుష్ప 2 ది రూల్, ఛావాలతో…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం సాగర నగరం విశాఖపట్టణం…
ఏపీ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖపట్టణం… గతంలో ఎలా ఉందో, భవిష్యత్తులోనూ అలాగే ఉండనుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం…