కన్యాశుల్కం.. ఎంతమంది తీస్తారమ్మా?

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. తనదైన శైలిలో దర్శకత్వం అండ్ రైటింగ్ తో ఇంప్రెస్ చేస్తున్న కమెడియన్ అవసరాల శ్రీనివాస్.. ఇప్పుడు అలనాటి ‘కన్యాశుల్కం’ నాటకాన్ని తెరకెక్కించబోతున్నాడట. మెయిన్ లీడ్‌గా తనే గిరీశం పాత్రంలో మెరవబోతున్నడని వినిపిస్తోంది. అయితే గురజాడ అప్పారవ్ రాసిన ఈ నాటకాన్ని ఎంతమంది సినిమాలుగా తీస్తారంటూ ఇప్పుడు ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

ముందుగా కన్యాశుల్కం గురించి మాట్లాడుకుంటే.. ముసలోడికి చిన్నపిల్లలను ఎదురుకట్నం ఇచ్చి పెళ్లిచేయడం అనే కాన్సెప్ట్‌పై రాసిన ఈ నాటకం.. ఇప్పటి పరిస్థితులకు అస్సలు సెట్టవ్వదు. కొత్తగా మార్చి తీస్తే ఆడదు. 1892 నాటి సెటప్ లో తీయాలంటే భారీ బడ్జెట్ అవుతుంది. అదీ కాకుండా.. ఈ నాటకంలో చాలాపాత్రలు బ్రాహ్మణులే. బ్రాహ్మిణ్‌ క్యాస్ట్ మీద గురజాడ వేసిన సెటైరే ఈ నాటకంలో మెయిన్ హ్యూమర్ ఎలిమెంట్. పైగా మెయిన్ హీరోయిన్ మధురవాణి ఒక వేశ్య. ఆమె ద్వారా హీరో జీవితపరమార్ధం గ్రహించి.. చివరకు ఒకమ్మాయిని పెళ్ళిచేసుకుంటాడు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా క్యాస్ట్ తరహా ప్రాజెక్టులు చేస్తే.. దానికి నిరసన సెగలు ఏ రేంజులో తగులుతున్నాయో తెలిసిందే. అలాగే ప్రాస్టిట్యూట్ అంటూ చూపించాలన్నా కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది.

ఇదంతా ఒకెత్తయితే, ఆల్రెడీ‌ కన్యాశుల్కం ను వెబ్‌సిరీస్‌గా తీయడానికి దర్శకుడు క్రిష్‌ ఎప్పుడో రంగం సిద్దంచేసుకున్నాడు. ఒక ప్రముఖ ఓటిటి ఫ్లాట్‌ఫామ్‌కు తీసేయాలని చాలా ప్రయత్నించాడు. రైటింగ్, క్యాస్టింగ్ అన్నీ అయిపోయాయి. కొన్నిరోజులు షూటింగ్ కూడా జరిగింది. కాని ఎందుకో తరువాత ఈ సిరీస్ గురించి ఎటువంటి న్యూస్ లేనేలేదు. ఈ టైములో శ్రీనివాస్ అవసరాల మళ్ళీ కన్యాశుల్కం అంటే అంత కిక్ మాత్రం రావట్లేదు.