బాక్సాఫీస్ దగ్గర కన్నడ సినిమాల డ్రీమ్ రన్ కొనసాగుతోంది. కొన్ని నెలల కిందటే ‘కేజీఎఫ్-2’ ఎలా వసూళ్ల మోత మోగించిందో తెలిసిందే. డివైడ్ టాక్‌ను కూడా తట్టుకుని ఏకంగా రూ.1200 కోట్ల వసూళ్ల మార్కును దాటేసిందా చిత్రం. ఆ తర్వాత కిచ్చా సుదీప్ సినిమా ‘విక్రాంత్ రోణ’ సైతం పలు భాషల్లో మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు నెల రోజులుగా ‘కాంతార’ అనే సినిమా రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు.
ఈ సినిమాకు సంబంధించి ఎవ్వరూ కూడా ఇతర భాషల వాళ్లకు పెద్దగా పరిచయం లేకపోయినా.. ఈ కథాంశం కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల నేటివిటీతో ముడిపడ్డది అయినా.. ఈ సినిమా అన్ని భాషల వాళ్లకు విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. తెలుగు వెర్షన్ వసూళ్లు దాదాపు రూ.60 కోట్ల దాకా ఉండగా.. హిందీ వెర్షన్ అంతకంటే ఎక్కువే రాబట్టింది.
కన్నడలో రిలీజై ఐదు వారాలు దాటినా.. తెలుగు, హిందీ భాషల్లో నాలుగు వారాలు అవుతున్నా ‘కాంతార’ జోరేమీ తగ్గలేదు. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని మైలురాయిని అందుకుంది. రూ.350 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని అందుకోవడమే కాక.. ‘పుష్ప’ సినిమా కలెక్షన్లను అధిగమించింది.
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరో నటించాడు. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ఆ సినిమా తీశాడు. తెలుగులో ఆ చిత్రానికి ఉన్న హైప్ గురించి తెలిసిందే. హిందీలో ఆ చిత్రానికి ఊహించని స్పందన వచ్చింది. ఇతర భాషల్లోనూ పర్వాలేదనిపించింది. దీంతో వరల్డ్ వైడ్ రూ.350 కోట్లకు చేరువగా వెళ్లింది. ఐతే ‘కాంతార’ లాంటి చిన్న సినిమా ‘పుష్ప’ లాంటి భారీ చిత్రాన్ని అధిగమించడం చిన్న విషయం కాదు. ఇది ఎవ్వరి ఊహకూ అందని విషయం. ఈ సినిమా జోరు చూస్తుంటే త్వరలోనే రూ.400 కోట్ల గ్రాస్ మార్కును కూడా సులువుగానే దాటేసేలా కనిపిస్తోంది.
This post was last modified on November 10, 2022 3:39 pm
2021 డిసెంబర్ 8న త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరులో కూలిపోయిన…
2024 మెగా ఫ్యామిలీ బాగానే కలిసొచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవడం ఆ కుటుంబంలో ఎప్పుడూ లేనంత పండగ…
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో దారుణం వెలుగుచూసింది. ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో ఇల్లు నిర్మిస్తున్న సాగి తులసి…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. ఫార్ములా ఈ-కారు రేసు వివాదం కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.…
బాలీవుడ్లో గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్స్ కమ్ డైరెక్టర్లలో విధు వినోద్ చోప్రా ఒకడు. మున్నాభాయ్ సిరీస్, 3 ఇడియట్స్ లాంటి గొప్ప…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై…