టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఓవైపు భారీ చిత్రాలు నిర్మిస్తూనే.. అప్పుడప్పుడూ బయటి వాళ్లు చిన్న సినిమాలు నచ్చి తన బేనర్ మీద రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ కోవలోనే ఓ చిన్న చిత్రాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు దిల్ రాజు. ఆ సినిమా పేరు.. మసూద. ‘జార్జిరెడ్డి’, ‘పలాస’ లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన తిరువీర్ ఇందులో హీరోగా నటించగా.. ‘ఖడ్గం’ సహా చాలా సినిమాలతో ఆకట్టుకున్న సీనియర్ నటి సంగీత ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషించింది.
‘గంగోత్రి’లో బాల నటిగా ఆకట్టుకున్న కావ్య కళ్యాణ్ రామ్ మరో కీలక పాత్ర చేసింది. సాయికిరణ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా టీజర్‌ను కొన్ని రోజుల కిందటే నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశాడు. బడ్జెట్ పరంగా చిన్న సినిమానే అయినా.. కంటెంట్ పరంగా రిచ్‌గానే కనిపించి ‘మసూద’. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపించింది.
ఇది నజియా అనే ఓ ముస్లిం అమ్మాయి చుట్టూ తిరిగే కథ. మానసిక సమస్యలతో బాధ పడుతున్న ఆ అమ్మాయి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుండటం.. దయ్యాన్ని చూశానని చెప్పి తాను భయపడడమే కాక అందరినీ భయపెట్టడం.. తనను మామూలు మనిషిని చేయడానికి తన వాళ్లు పడే తాపత్రయం.. ఈ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. సంగీత ఇందులో సైన్స్ టీచర్ పాత్ర పోషించింది. మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి చిత్రాలతో అభిరుచిని చాటుకున్న రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ నెల 18న ‘మసూదను’ రిలీజ్ చేస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్లో దిల్ రాజుతో పాటు ‘మసూద’ టీం అంతా పాల్గొంది.
రాహుల్ యాదవ్ నిర్మించిన తొలి రెండు చిత్రాలకు తాను అభిమానినని.. అతను తీసే మూడో సినిమాను తాను రిలీజ్ చేస్తానని ముందే మాట ఇచ్చానని, ఆ ప్రకారమే మసూద మూవీతో అసోసియేట్ అయ్యానని రాజు తెలిపాడు. ఇంకా మసూద సినిమా చూడకముందే రాజు దీన్ని తన బేనర్ మీద రిలీజ్ చేయడానికి డిసైడయ్యాడట. టీజర్ చాలా బాగుందని, త్వరలోనే సినిమా చూడబోతున్నానని రాజు తెలిపాడు.
This post was last modified on November 9, 2022 8:58 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…