అనారోగ్యంతో బాధ పడుతున్నా సరే.. మనో ధైర్యం కోల్పోకుండా పోరాడుతుండడమే కాక.. తన కొత్త సినిమా ‘యశోద’ ప్రమోషన్ల కోసం వీడియో ఇంటర్వ్యూ చేసి తన కమిట్మెంట్‌ను చాటుకుంది సమంత. ఇందులో తన అనారోగ్యం గురించి మాట్లాడుతూ సమంత చూపించిన సంకల్ప బలం అందరికీ స్ఫూర్తినిస్తోంది. ఆమెకు సోషల్ మీడియాలో అపూర్వమైన మద్దతు లభిస్తోంది.
స్టే స్ట్రాంగ్, అండ్ కమ్ బ్యాక్ అంటూ ఆమెకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ ఇంటర్వ్యూలో ‘యశోద’ గురించి చాలా ముచ్చట్లే చెప్పింది సామ్. తాను మామూలుగా ఏదైనా కథ వింటే.. ఆ సినిమా చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి కనీసం ఒక్క రోజైనా సమయం తీసుకుంటానని.. కానీ ఈ కథను మాత్రం విన్న వెంటనే ఓకే చేసేశానని ఆమె తెలిపింది.
తనకు థ్రిల్లర్ జానర్ అంటే చాలా ఇష్టమని.. ఈ జానర్లో తెరకెక్కిన ‘యశోద’లో ఊహించని మలుపులు ఉంటాయని ఆమె చెప్పింది. ఈ రోజుల్లో ప్రేక్షకులు బాగా తెలివి మీరిపోయారని.. సినిమాలో 60 శాతం ట్విస్టులను ముందే ఊహించేసి చెప్పేస్తున్నారని.. ఇది దర్శకులకు సవాలే అని ఆమె పేర్కొంది.
దర్శకులకు నువ్వా నేనా అన్నట్లు ఛాలెంజ్ విసురుతున్నారని.. దర్శకులు తమకంటే తెలివైన వాళ్లు అయ్యుండాలని కోరుకుంటున్నారని ఆమె అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో థ్రిల్లర్ సినిమాల్లో వారి అంచనాలను మించి ట్విస్టులు ఉండేలా చూసుకోవడం సవాలే అని ఆమె పేర్కొంది. ‘యశోద’ సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయని.. కానీ వాటిని ప్రేక్షకులు ముందు గెస్ చేయలేరని.. ఇది తన సవాలు అని సమంత పేర్కొంది. మరి సమంత చెబుతున్న రేంజిలో ‘యశోద’ ట్విస్టులు ప్రేక్షకులను షాక్‌కి గురి చేస్తాయేమో చూడాలి.
This post was last modified on November 8, 2022 8:02 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…