బాలీవుడ్ చరిత్రలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ గా చెప్పుకోదగ్గ సినిమాల్లో మొదటి స్థానం షోలే అయితే రెండోది హం ఆప్కే హై కౌన్. మూడున్నర గంటల లెన్త్ తో సగం నిడివి కేవలం పాటలతో నడిచే ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ థియేటర్లో చూసేందుకు జనం తండోపతండాలుగా ఎగబడిపోయేవారు. దీని దర్శకుడు సూరజ్ ఆర్ బరజాత్య అంతకు ముందు తీసిన మైనే ప్యార్ కియా సైతం ఒక ల్యాండ్ మార్క్ మూవీనే. సల్మాన్ ఖాన్ ఇప్పుడు అనుభవిస్తున్న స్టార్ డంకు బలమైన పునాది వేసింది ఈ రెండే. రాజశ్రీ బ్యానర్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి కారణం కూడా సూరజే.
అంత ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్న డైరెక్టర్ మూవీ అందులోనూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో చేసిందంటే ఎలాంటి అంచనాలు ఉండాలి. కానీ ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఊంచాయి విషయంలో అసలెలాంటి సౌండ్ వినిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నీరసంగా ఉన్నాయి. చనిపోయిన స్నేహితుడి చివరి కోరిక తీర్చడం కోసం వయసు మళ్ళిన వృద్ధుల బ్యాచ్ సాహసోపేతమైన హిమాలయ పర్వతాల మీద ట్రెక్కింగ్ చేయడమనే పాయింట్ తో ఇది రూపొందింది. మొత్తం ముసలి బ్యాచే ఉండటంతో ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించడం లేదని ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది.
అసలే స్లంప్ లో ఉన్న బాలీవుడ్ కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ది కాశ్మీర్ ఫైల్స్, బ్రహ్మాస్త్ర, భూల్ భూలయ్యా 2 తర్వాత చెప్పుకోదగ్గ హిట్టు ఒక్కటీ లేదు. పట్టుమని పాతిక కోట్లు తేలేక అన్నీ తోక ముగుస్తున్నాయి. అమితాబ్ కు సైతం టైం కలిసి రావడం లేదు. ఆ మధ్య రష్మిక మందన్నతో చేసిన గుడ్ బైని మరీ దారుణంగా చాప చుట్టేసింది. ఇప్పుడీ ఊంచాయి మీద జీరో బజ్ నడుస్తోంది. టాక్ ఏమైనా పాజిటివ్ గా వస్తే తప్ప ఇంకేం ఆశించలేం. దీని తర్వాత సూరజ్ మరోసారి సల్మాన్ ఖాన్ తో చేయబోతున్నారు.
This post was last modified on November 8, 2022 6:00 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…