వచ్చే సంక్రాంతికి చిరంజీవి -బాలయ్య వారి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలతో హీరోల మధ్యే కాదు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా పొంగల్ పోటీ ఉండబోతుంది. అవును దేవి శ్రీ ప్రసాద్ ‘వాల్తేరు వీరయ్య’ తమన్ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో మ్యూజిక్ పరంగా పోటీ పడబోతున్నారు. రెండేళ్ళ క్రితం సంక్రాంతి కి ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది. సరిలేరు నీకెవ్వరు – అల వైకుంఠ పురములో రెండు సినిమాలు 2020 సంక్రాంతికి రిలీజయ్యాయి. ‘సరిలేరు నీకెవ్వరు’కి దేవి సూపర్ హిట్ ఆల్బం అందిస్తే , ‘అల వైకుంఠ పురములో’ కి అదిరిపోయే ఆల్బం ఇచ్చి డిఎస్పీ పై చేయి సాదించాడు తమన్.
‘అల వైకుంఠపురములో’ తమన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళి బిలియన్ వ్యూస్ సాదించిన మ్యూజిక్ డైరెక్టర్ గా టాప్ లో నిలబెట్టింది. ఇక దేవి కూడా పుష్ప తో సత్తా చాటుకున్నాడు కానీ తన మ్యూజిక్ తో తమన్ ని మ్యాచ్ చేయలేకపోతున్నాడు. అయితే ఈ సంక్రాంతికి మాత్రం ఇద్దరికీ టఫ్ అవ్వనుంది. ఇంకా రెండు సినిమాల నుండి ఒక్క సాంగ్ కూడా రిలీజ్ అవ్వలేదు. కేవలం టీజర్ వరకూ మాత్రమే దేవి , తమన్ ల వర్క్ బయటికొచ్చింది.
బాలయ్య అంటే తమన్ ప్రాణం పెట్టేస్తాడు. ‘ అఖండ’ కి అదిరిపోయే సాంగ్స్ తో పాటు గూస్ బంప్స్ తెప్పించే స్కోర్ ఇచ్చాడు. ఇక చిరంజీవి అంటే దేవి స్పెషల్ మ్యూజిక్ అందిస్తాడు. ఈ కాంబో లో వచ్చిన ప్రతీ ఆల్బం సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ మధ్య చిరంజీవి నుండి బెస్ట్ ఆల్బం రాలేదు. ‘ఆచార్య’ సాంగ్స్ మెప్పించలేకపోయాయి. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య కి దేవి మెస్మరైజ్ చేసే ఆల్బం ఇస్తాడని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక వీరసింహా రెడ్డి కి తమన్ ఎలాగో బెస్ట్ ఇస్తాడని నందమూరి ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయరు. మరి ఇద్దరిలో బెస్ట్ ఆల్బం తో మ్యూజిక్ లవర్స్ ని మెప్పించేదేవరు ? ఇద్దరిలో ఈసారి పై చేయి సాదించేదేవరు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి దేవి వర్సెస్ తమన్ పోటీలో ఎవరు విన్ అవుతారో చూడాలి.
This post was last modified on November 9, 2022 12:07 pm
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…