Movie News

అవతార్-4, 5 రావాలంటే..

అవతార్.. ప్రపంచ సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిల ో వెండితెరపై అద్భుత అనుభూతిని కలిగించిన చిత్రం. అలాగే నభూతో అన్న తరహాలో వసూళ్ల రికార్డులనూ నెలకొల్పిన సినిమా అది. అప్పటికే ‘టైటానిక్’ అద్భుతాన్ని ఆవిష్కరించిన జేమ్స్ కామెరూన్.. దశాబ్ద కాలం పైగా కష్టపడి ఈ సినిమా తీశాడు. ‘అవతార్’ అసాధారణ విజయం సాధించాక మరింత సమయం వెచ్చించి ‘అవతార్-2’ను రెడీ చేశాడు. వచ్చే నెల 16నే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనిపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

కాగా ఈ సినిమా విడుదలకు ముందే ‘అవతార్’ ఐదు భాగాలుగా వస్తుందని కామెరూన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. చాలా ముందుగానే ఇంకో మూడు సినిమాలకు ఆల్రెడీ రిలీజ్ డేట్లు కూడా ఇచ్చేశాడు.

కానీ అవతార్-4, 5 భాగాలు కచ్చితంగా వస్తాయనే గ్యారెంటీ లేదని ఇంతకుముందే కామెరూన్ సంకేతాలు ఇచ్చాడు. ఇప్పుడు ఇదే విషయమై స్పష్టమైన ప్రకటన చేశాడు. అవతార్-2 తాను ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోతే, ఇది ఫ్లాప్ అయితే అవతార్-4, 5 రాబోవని కామెరూన్ తేల్చేశాడు. అవతార్-2 ఫలితాన్ని బట్టే 4, 5 భాగాల కోసం పని చేయాలా వద్దా అన్నది తన టీం నిర్ణయించుకుంటుందని, ఇది ఫ్లాప్ అయితే ఆ పని ఆపేస్తామని ఆయన చెప్పాడు.

ఐతే ‘అవతార్-3’కి సంబంధించి షూట్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ చాలా వరకు పూర్తయిందని.. ఆ సినిమా మాత్రం కచ్చితంగా వస్తుందని చెప్పాడు కామెరూన్. ఆ సినిమా వచ్చే ఏడాది చివర్లోనే విడుదల కావాల్సి ఉంది. ఐతే అవతార్-2 మీద ఉన్న హైప్, వైడ్ రిలీజ్‌ను బట్టి చూస్తే కమర్షియల్‌గా మాత్రం ఈ సినిమా అసాధారణ ఫలితాన్ని అందుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. టాక్‌తో సంబంధం లేకుండా ఇప్పటిదాకా ఉన్న అన్ని వసూళ్ల రికార్డులనూ ఇది బద్దలు కొడుతుందనే భావిస్తున్నారు. మరి ఈ సినిమా సక్సెస్‌ను కామెరూన్ ఎలా కొలుస్తాడన్నది చూడాలి.

This post was last modified on November 8, 2022 3:50 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

11 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

19 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

34 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

35 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago