చిన్నప్పుడు ఇంద్ర సినిమాలో జూనియర్ చిరంజీవిగా మెప్పించిన తేజ సజ్జా.. పెద్దయ్యాక హీరో అయిపోయి చాలా సినిమాలే చేశాడు. కాని ఇంకా రావల్సినంత బ్రేక్ మాత్రం రాలేదు. అయితే ఈసారి మనోడు ఒక సూపర్ హీరో కాన్సెప్టుతో వస్తున్నాడు. తనతో ఆల్రెడీ జాంబీ రెడ్డి సినిమాను తీసిన ప్రశాంత్ వర్మ డైరక్షన్లో ఇప్పుడు ‘హను మ్యాన్’ అంటూ ఒక సినిమాతో అలరించబోతున్నాడు. కాని ఈ సినిమా కాన్సెప్టే ఇప్పుడు అన్నింటికంటే చాలా డేంజరస్ థింగ్. ఎందుకంటారా?
వెబ్‌లోకి టీజర్ ట్రైలర్ వచ్చీ రాగానే విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ గురించి మూవీ లవ్వర్స్ చేస్తున్న కామెంట్స్ ఎలా ఉంటున్నాయో తెలిసిందే. మరి సూపర్ హీరో సినిమా అంటూ ఇప్పుడు కుర్ర హీరో తేజ సజ్జాను ఒక పవర్ఫుల్ హను-మ్యాన్ అంటూ చూపిస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఖచ్చితంగా గ్రాఫిక్స్ పరంగా చాలా టాప్ క్వాలిటీ వర్క్‌తోనే బయటకు రావాలి. ఈ మధ్యన వచ్చిన ఆదిపురుష్ టీజర్ చుట్టూ ఎలాంటి నెగెటివ్ కామెంట్లు వినిపించాయో తెలిసిందేగా. పైగా ఇప్పటికే ఈ సినిమాను పలుమార్లు పోస్ట్‌పోన్ చేస్తుంటే, ఖచ్చితంగా గ్రాఫక్స్‌కు సంబంధించి ఏదో ఫైన్ ట్యూన్ చేస్తున్నారని కూడా టాక్ వస్తోంది. అందులోనే ట్రైలర్లోనే గ్రాఫిక్స్ షాట్స్ పెడితే మాత్రం.. వాటివరకు విపరీతమైన క్వాలిటీ ఉండాల్సిందే.
నిజానికి బింబిసారా సినిమా వచ్చినప్పుడు.. కాన్సెప్టు కొత్తగా ఉండటంతో వీక్ గ్రాఫిక్స్ మీద ఎవ్వరూ కామెంట్ చెయ్యలేదు. కాని సూపర్ హీరో సినిమాలకు మాత్రం.. ఆల్రెడీ మనోళ్ళు రెగ్యులర్‌గా హాలీవుడ్ సినిమాలను వెండితెరపై చూస్తూనే ఉంటారు కాబట్టి.. ఖచ్చితంగా అదే రేంజు క్వాలిటి కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇక టీజర్ వస్తనే ఈ సినిమా తాలూకు అసలు కలర్ ఏంటనేది బయటపడుతుంది.
This post was last modified on November 8, 2022 9:01 am
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…