ఒకపక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్యాన్ ఇండియా మూవీ మరోవైపు లోకనాయకుడు కమల్ హాసన్ ఇండియన్ 2 చేస్తూనే దర్శకుడు శంకర్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇంకా అఫీషియల్ గా ప్రకటించనప్పటికీ దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కం స్క్రిప్ట్ పనులను తెరవెనుక చేయిస్తున్నట్టు చెన్నై అప్ డేట్. దీనికి స్ఫూర్తి పొన్నియన్ సెల్వన్ అంటే ఆశ్చర్యం కలగక మానదు. మణిరత్నం ఆవిష్కరించిన ఈ చోళ రాజ్య దృశ్యకావ్యం ఒరిజినల్ వెర్షన్ నుంచి ఏకంగా నాలుగు వందల కోట్లు రాబట్టిన సంగతి తెలిసిందే. దీని దెబ్బకే పిఎస్ 2కి తమిళనాడులో డిమాండ్ పెరిగింది.
ఇలాంటిదే వేల్పరి అనే మరో నవల అరవనాట సుప్రసిద్ధం. ఇందులోనూ బోలెడంత డ్రామా, ప్రేమ, భావోద్వేగాలు, కుట్రలు కుతంత్రాలు, రాజకీయాలు అన్నీ ఉంటాయి. దీన్ని మూడు భాగాల ట్రయాలజీగా తీసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. హీరో మాత్రం బాలీవుడ్ నుంచే తీసుకుంటున్నారు. రణ్వీర్ సింగ్ హీరోగా చేయబోతున్నారు. నిజానికి ఈ కాంబోలో అపరిచితుడు హిందీ రీమేక్ జరగాల్సి ఉంది. కానీ అది ఎంత మేరకు వర్కౌట్ అవుతుందనే దాని మీద అనుమానాలు తలెత్తడంతో ఆ ప్రాజెక్టుని పెండింగ్ లో పెట్టినట్టు తెలిసింది. విక్రమ్ అన్నియన్ డబ్బింగ్గే అక్కడ పెద్ద హిట్టు.
వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెట్టి 2024 విడుదల టార్గెట్ గా శంకర్ మొత్తం సెట్ చేస్తున్నారు. నిర్మాణ సంస్థగా పెన్ స్టూడియోస్ తో పాటు మరికొన్ని బ్యానర్లు భాగస్వామిగా ఉంటాయి. అవేంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి రణ్వీర్ తప్ప ఇంకే క్యాస్టింగ్ ని కన్ఫర్మ్ చేయలేదు. ఆర్సి 15ని వచ్చే వేసవి లోగా పూర్తి చేసి ఇండియన్ 2ని దీపావళికి సిద్ధం చేసేలా ప్రణాళిక వేసుకున్న శంకర్ వాటి విడుదల తేదీలను మాత్రం ఆయా నిర్మాతలకే వదిలేయనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎంత టైం పడుతుందనే దాన్ని బట్టి రిలీజ్ డేట్లలో మార్పులు చేర్పులు ఉండొచ్చు
This post was last modified on November 7, 2022 9:37 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…