ఆది పురుష్ కొత్త రిలీజ్ డేట్ వచ్చాక సలార్ టీమ్ కి టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే ఓం రౌత్ సినిమా జనవరికి ఖాయంగా వస్తుందనే నమ్మకంతో ప్రశాంత్ నీల్ టీమ్ తమ చిత్రాన్ని సెప్టెంబర్ కి ఫిక్స్ చేస్తున్నారు. తీరా చూస్తే ఇప్పుడీ ట్విస్టు వచ్చి పడింది. అలా అని ముందు అనుకున్నట్టు ప్రొసీడ్ అవుదామా అంటే కేవలం మూడు నెలల గ్యాప్ తో ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ మూవీస్ రెండు రిలీజ్ చేయడం బిజినెస్ కోణంలో కరెక్ట్ కాదు. పైగా బయ్యర్లు సైతం దీనికి నో అనే చెబుతారు. ఇంతకీ ఆది పురుష్ అప్పుడైనా మాటకు కట్టుబడి ఉంటుందా అంటే ఏమో శివయ్యకే ఎరుక అని చెప్పాలి.
విఎఫెక్స్ రిపేర్లకు ఆరు నెలల ఎక్స్ ట్రా టైం తీసుకుంటున్నారా లేక టీజర్ మీద వచ్చిన నెగటివ్ కామెంట్స్ ని జనం మర్చిపోవడానికి ఆ మాత్రం సమయం అవసరమనుకున్నారా అనేది ఇప్పుడే చెప్పలేం. రీ వర్క్ చేయబోతున్న ఆదిపురుష్ గ్రాఫిక్స్ మీద అదనంగా వంద కోట్లు ఖర్చు చేయబోతున్నారనే వార్త మాత్రం మీడియా సర్కిల్స్ లో విస్తృతంగా తిరుగుతోంది. దర్శకుడు ఓం రౌత్ దేశం మొత్తం గర్వపడే సినిమా తీస్తున్నామని అందుకే జాప్యం తప్పడం లేదని కవరింగ్ చేసుకునే ప్రయత్నం ప్రభాస్ ఫ్యాన్స్ లో ఒకవర్గానికి మాత్రమే కన్విన్సింగ్ గా అనిపిస్తే అధిక శాతం మాత్రం కోపంగా ఉన్నారు.
ఇప్పుడు సలార్ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టు తయారయ్యింది. సరే ఆదిపురుష్ జూన్ లో వస్తుంది కాబట్టి మనం ఏ డిసెంబర్ కో లేదా 2024 సంక్రాంతికో షిప్ట్ అవుదామా అంటే టి సిరీస్ వ్యవహారాలను అంత ఈజీగా నమ్మలేం. మళ్ళీ ఏ మేలోనో ఇంకా పనవ్వలేదు అగైన్ పోస్ట్ పోన్ అంటే ఎవరేం చేయగలరు. రాధే శ్యామ్, సాహోలకు జరిగింది ఇదే. ఎక్కడో ఉరుము ఉరిమితే ఇంకెక్కడో పిడుగు పడ్డట్టు ప్రభాస్ ఒకేసారి ఇన్నేసి సినిమాలు చేయడం వల్లే ఇలాంటి ఇబ్బందులు తలెత్తున్నాయి. అభిమానులు మాత్రం యానిమేషన్ మిక్స్ ఉన్న ఆది పురుష్ కన్నా సలార్ ముందు రావాలని కోరుకుంటున్నారు