బాయ్‌కాట్ బాలీవుడ్.. కొన్ని నెలల నుంచి బాలీవుడ్‌ను వేధిస్తున్న సోషల్ మీడియా ట్రెండ్ ఇది. ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టి హిందీలో పెద్ద పెద్ద సినిమాలను ఒక వర్గం అదే పనిగా టార్గెట్ చేస్తుండడం.. విపరీతమైన నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తుండడం తెలిసిందే.
బాగున్న సినిమాను వీళ్లు కిల్ చేయలేరు అనే మాట వాస్తవమే అయినప్పటికీ.. బాగా లేని సినిమాలకు వీళ్లు చేస్తున్న డ్యామేజ్ ఎక్కువ అన్నది మాత్రం అర్థం చేసుకోవాల్సిందే. ‘లాల్ సింగ్ చడ్డా’ లాంటి సినిమాలు థియేటర్లలోకి దిగకముందే కిల్ అయిపోవడానికి ఈ బాయ్‌కాట్ బ్యాచ్ నెగెటివిటీనే కారణం. మరికొన్ని సినిమాలు వీరి ధాటికి బలయ్యాయి. దీనిపై కొందరు వినమ్రంగా మాట్లాడారు. కొందరు ఎదురు దాడి చేశారు. కానీ బాయ్‌కాట్ బ్యాచ్ మాత్రం దేనికీ ప్రభావితం కాకుండా.. తాము చేయాలనుకున్నది చేస్తున్నారు.
తాజాగా ఈ ట్రెండ్ గురించి స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ స్పందించింది. సినిమాలను బ్యాన్ చేయాలనే కల్చర్.. ఒక రకంగా బెదిరింపులకు పాల్పడడమే. ఇలాంటిది సినీ రంగానికి పరిమితం కాదు. ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. దీని వెనుక చాలా కోణాలు ఉన్నాయి. ప్రస్తుత ఈ ఆన్ లైన్ హేట్ సమాజంలో ద్వేషాన్ని నింపేలా ఉంది.
నేను కూడా పలు సందర్భాల్లో వ్యక్తిగతంగా ఈ ‘హేట్’ను ఎదుర్కొన్నా. నన్ను సోషల్ మీడియాలో చాలా మాటలు అన్నారు. చుడైల్ (మంత్రగత్తె అని అర్థం) అని కూడా పిలిచేవాళ్లు. నేను ఇలాంటి నెగెటివిటీని ఎదుర్కోవడానికి నాకంటూ ఒక మార్గాన్ని ఎంచుకున్నాను. ఏం జరిగినా పాజిటివ్‌గానే ఉండాలని దృఢ నిశ్చయంతో ఉన్నాను. ఏ రంగంలో అయినా సరే.. నెగెటివిటీ, హేట్ అనేవి మంచిది కాదు’’ అని శ్రుుతి అభిప్రాయపడింది. మధ్యలో కెరీర్లో కొంచెం గ్యాప్ తీసుకున్న శ్రుతి ‘క్రాక్’ మూవీతో టాలీవుడ్లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’, ‘సలార్’ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది.
This post was last modified on November 8, 2022 6:27 am
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…