మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏడాదిన్నరగా ‘ఆర్ఆర్ఆర్’కు అంకితమై ఉన్నాడు. ముందు అనుకున్న ప్రణాళికల ప్రకారం అయితే ఈపాటికి ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఉండాలి. ఈ నెలలోనే ఆ సినిమా విడుదలై ఉండాలి. కానీ ఎప్పట్లాగే రాజమౌళి ఆలస్యం చేశాడు.
‘ఆర్ఆర్ఆర్’ను వచ్చే సంక్రాంతికి వాయిదా వేయించాడు. కానీ కరోనా పుణ్యమా అని ఆ డేట్ కూడా అందుకోవడం అసాధ్యం అని తేలిపోయింది. ఈ సినిమాలో తన పని పూర్తి చేసి చరణ్ ఎఫ్పటికీ ఫ్రీ అవుతాడో చెప్పలేని పరిస్థితి.
ఐతే ఇప్పటికే ‘రంగస్థలం’తో తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్న చరణ్.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మరింత ఎత్తుకు ఎదగడం ఖాయం. అప్పుడు చరణ్‌తో సినిమా చేసే అవకాశం దక్కితే అది బంపరాఫరే. ఆ ఆఫర్‌ను దక్కించుకోవడానికి చాలామంది దర్శకులే లైన్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ చేయబోయే సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా కనీసం అరడజను కాంబినేషన్లు అయినా వినిపించి ఉంటాయి. ముందు ‘ఆచార్య’ చేస్తున్న కొరటాల శివతో సినిమా ఉంటుందన్నారు. తర్వాత సుకుమార్ కాంబినేషన్ రిపీట్ కావచ్చన్నారు. ఒక దశలో ‘సైరా’ దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు వినిపించింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా కూడా ఓ కథ చెప్పి చరణ్‌తో ఓకే చేయించుకున్నట్లు ఇటీవల ఓ వార్త బయటికి వచ్చింది.
మరోవైపు అల్లు కాంపౌండ్లో ఎప్పట్నుంచో తిరుగుతున్న ఓ కొత్త దర్శకుడు కూడా చరణ్‌ను మెప్పించినట్లు ప్రచారం జరిగింది. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు వంశీ పైడిపల్లితో చరణ్ కాంబినేషన్ గురించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. మహేష్‌తో సినిమా మిస్సయ్యాక చరణ్ కోసం ఓ కథ రెడీ చేసిన వంశీ.. ఇటీవల అతడితో ఓకే చేయించుకున్నట్లు చెబుతున్నారు. ‘ఎవడు’ తర్వాత వీళ్ల కాంబినేషన్ రిపీట్ కాబోతోందంటున్నారు. మరి ఈ కాంబినేషన్లలో ఏది నిజమవుతుంది.. ఏ సినిమా ముందుగా పట్టాలెక్కుతుంది అన్నది చూడాలి.
This post was last modified on July 12, 2020 2:42 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…