గత ఏడాది చివర్లో విడుదలైన ‘పుష్ప’ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా ముందు డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో దాని బాక్సాపీస్ ఫలితం మీద సందేహాలు నెలకొన్నాయి. కానీ ఆ టాక్‌ను తట్టుకుని బలంగా నిలబడ్డ సినిమా.. భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగును మించి ఇతర భాషల్లో ఆ సినిమా బాగా ఆడింది. ముఖ్యంగా హిందీలో అయితే ట్రేడ్ పండిట్లను షాక్‌కు గురి చేసే వసూళ్లు రాబట్టింది.
ఇక ఆ సినిమా పాటలు, మేనరిజమ్స్ అంతర్జాతీయ స్థాయిలో ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. దీంతో ‘పుష్ప-2’ మీద అంచనాలు మరో స్థాయికి వెళ్లిపోయాయి. వాటిని అందుకోవడం కోసం సుకుమార్ తన టీంతో కలిసి మరింత కసరత్తు చేశాడు. బాగా టైం తీసుకుని సెకండ్ పార్ట్ కోసం స్క్రిప్టు రెడీ చేశాడు. ఇటీవలే చిత్ర బృందం చిత్రీకరణ కూడా మొదలుపెట్టింది.
ఐతే సినిమా ఆరంభ దశలో ఉండగానే అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లే స్టేట్మెంట్ ఇచ్చాడు అల్లు అర్జున్ ఆప్త మిత్రుడు, నిర్మాత బన్నీ వాసు. అల్లు శిరీష్ సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’ సక్సెస్ మీట్లో అతను మాట్లాడుతూ.. తనను అందరూ ‘పుష్ప-2’ అప్‌డేట్ గురించి అడుగుతున్నారని.. వాళ్లందరికీ ఒకటే చెబుతున్నానని.. ‘పుష్ప-2’తో స్క్రీన్లు పగిలిపోతాయని బన్నీ వాసు పేర్కొన్నాడు. మామూలుగా స్క్రీన్లు చిరిగిపోతాయని అంటుంటారని.. కానీ ‘పుష్ప-2’ సినిమాది వేరే లెవెల్ అని, అందుకే ఆ సినిమాతో స్క్రీన్లు పగిలిపోతాయని అంటున్నానని బన్నీ వాసు అన్నాడు.
బన్నీ వాసు ఈ కామెంట్ చేస్తున్నపుడు బన్నీ ఎందుకు ఇంతగా చెబుతున్నావ్ అన్నట్లు అతణ్ని వారించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత బన్నీ మాట్లాడుతూ.. పుష్ప-2 విషయంలో తగ్గేదే లే అని కామెంట్ చేశాడు. ఈ సినిమా ఫలితం కచ్చితంగా పాజిటివ్‌గా ఉంటుందని ఆశిస్తున్నానని.. తనకు కలిగిన ఎగ్జైట్మెంట్ ప్రేక్షకులకు కూడా కలుగుతుందని అనుకుంటున్నానని చెప్పాడు. ‘పుష్ప సినిమా తగ్గేదే లే అయితే.. పుష్ప-2 సినిమా అసలు తగ్గేదేలే’’ అని బన్నీ స్టేట్మెంట్ ఇచ్చాడు.
This post was last modified on November 7, 2022 10:52 am
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…