Movie News

కొర‌టాల ద‌ర్శ‌న‌మిచ్చాడ‌బ్బా

ఆచార్య సినిమా రిలీజై ఆరు నెల‌లు దాటిపోయింది. ఈ ఆరు నెల‌ల్లో ఆ చిత్ర ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ బ‌య‌టెక్క‌డా క‌నిపించ‌లేదు. ఆ సినిమా విడుద‌ల‌కు ముందు ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇచ్చిన కొర‌టాల.. సినిమా దారుణ‌మైన డిజాస్ట‌ర్ కావ‌డంతో అడ్ర‌స్ లేకుండా పోయాడు. ఈ సినిమా చుట్టూ కొన్ని వివాదాలు ముసురుకున్నా, వాటిని నాలుగు గోడ‌ల మ‌ధ్య డీల్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడే త‌ప్ప బ‌య‌టికి రాలేదు.

ఆచార్య హీరో చిరంజీవి ప‌రోక్షంగా కొర‌టాలను ఉద్దేశించి విమ‌ర్శ‌లు చేసినా, ఆయ‌న్ని త‌క్కువ చేసే ప్ర‌య‌త్నం చేసినా కొర‌టాల వైపు నుంచి సౌండ్ లేదు. ఎలాగూ సోష‌ల్ మీడియాలో కూడా లేడు కాబ‌ట్టి వాటికి స‌మాధానం చెప్పే అవ‌కాశం లేక‌పోయింది. ఆచార్య బాధ ఒకెత్త‌యితే జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో అనుకున్న సినిమా స‌కాలంలో మొద‌లు కాక‌పోవ‌డం మ‌రో బాధ‌.

గ‌త కొన్ని నెల‌ల నుంచి ఎన్టీఆర్ సినిమా గురించి ఎన్నెన్నో ఊహాగానాలు వినిపించాయి. ఆ ప్రాజెక్టు మీద ప్ర‌శ్న‌లు రేకెత్తాయి. కొన్ని రోజుల కింద‌ట ఈ సినిమా ప‌క్కాగా ఉంటుంద‌ని మీడియాకు స‌మాచారం ఇచ్చారే త‌ప్ప‌.. అధికారికంగా చిత్ర బృందం నుంచి ఏ అప్‌డేట్ లేక‌పోయింది. ఐతే ఎట్ట‌కేల‌కు కొర‌టాల మ‌ళ్లీ మీడియాలోకి వ‌చ్చాడు. తార‌క్‌తో చేయ‌బోయే సినిమాకు సంబంధించి సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు సిరిల్‌ల‌తో కొర‌టాల చ‌ర్చిస్తున్న ఫొటోల‌ను మీడియాకు రిలీజ్ చేశారు.

ఎట్ట‌కేల‌కు కొర‌టాల మ‌ళ్లీ క‌నిపించ‌డం, ఎన్టీఆర్ సినిమా ముందుకు క‌దులుతున్న సంకేతాలు ఇవ్వ‌డంతో ఆయ‌న అభిమానుల‌తో పాటు తార‌క్ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల‌వుతున్నారు. కొర‌టాల మిత్రుడు మిక్కిలినేని సుధాక‌ర్‌తో క‌లిసి నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు. మ‌రి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ల‌బోతోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

This post was last modified on November 7, 2022 10:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

54 minutes ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

1 hour ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

1 hour ago

నారా కుటుంబం ప్ర‌జ‌ల సొమ్ము దోచుకోదు: భువ‌నేశ్వ‌రి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వెళ్లిన‌.. ఆయ న స‌తీమ‌ణి నారా…

3 hours ago

రివర్స్ గేమ్ ఆడబోతున్న ఉపేంద్ర ?

అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…

3 hours ago

ఆయ‌న సినిమా హీరో అంతే: డీజీపీ

అల్లు అర్జున్‌-పుష్ప‌-2 వివాదంపై తాజాగా తెలంగాణ‌ డీజీపీ జితేంద‌ర్‌ స్పందించారు. ఆయ‌న సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్య‌వ‌హారంపై…

4 hours ago