టాలీవుడ్లో సినిమా సినిమాకు లుక్ విషయంలో మార్పు చూపించాలని తపించే కథానాయకుల్లో అల్లు అర్జున్ ఒకడు. గత కొన్నేళ్లలో అతడి సినిమాల్ని పరిశీలిస్తే.. ‘సరైనోడు’కు సరికొత్త కొత్త లుక్‌లోకి మారాడు. ఆ తర్వాత వచ్చిన ‘డీజే’లో మరో రకంగా కనిపించాడు. ఆపై ‘నా పేరు సూర్య’లో నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపించాడు. పూర్తిగా అవతారమే మార్చేశాడు.
చివరగా నటించిన ‘అల వైకుంఠపురములో’ కోసం మరో కొత్త లుక్‌లో కనిపించాడు. ఇక సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే ‘పుష్ప’ కోసం కూడా బన్నీ అవతారం మార్చేసిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల పాటు జుట్టు, గడ్డం పెంచి బన్నీ ఇంతకుముందెన్నడూ కనిపించని లుక్‌లోకి మారాడు. ఇక షూటింగ్ ఆరంభమే తరువాయి అనుకున్న సమయంలో లుక్ కోసం టెస్ట్ షూట్ కూడా జరిగింది.
ఈ షూట్‌లో బన్నీ లుక్ పట్ల అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతా ఓకే అనుకున్నారు. కానీ అంతలో కరోనా వచ్చి పడింది. నెలలకు నెలలు షూటింగులు ఆగిపోయాయి. సినిమాకు అవసరమైనదానికంటే ఎక్కువగా బన్నీకి గడ్డం పెరిగిపోయింది. తాజాగా బన్నీ హైదరాబాద్ శివార్లలో రోడ్డు పక్కన కారు ఆపి మార్నింగ్ వాక్ చేస్తున్న ఫొటో ఒకటి షేర్ చేశాడు.
అంత స్పష్టత లేకపోయినా.. గడ్డం బాగా ఎక్కువై బన్నీ గుర్తు పట్టలేని విధంగా ఉన్నాడు. కరోనా షరతులు పాటిస్తూ షూటింగ్ చేయాలని ముందు అనుకున్నా.. అది సాధ్యపడదని ‘పుష్ప’ టీం ఆగిపోయినట్లు తెలుస్తోంది. మామూలు పరిస్థితులకు రావడానికి కనీసం రెండు నెలలు పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో గడ్డం మెయింటైన్ చేయడం అదీ బన్నీకి కష్టమవుతోందట. ఒకసారి గడ్డం తీసేసి.. మళ్లీ కొత్తగా పెంచి షూటింగ్ అవసరమయ్యే సమయానికి పాత్రకు తగ్గట్లు తయారవ్వాలని బన్నీ భావిస్తున్నాడట.
This post was last modified on July 12, 2020 2:37 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…