ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన సినిమా ‘లైగర్’. గతంలో ఏ ఫెయిల్యూర్‌కూ పెద్దగా ప్రభావతం కాని విజయ్ దేవరకొండ ఈ సినిమా ఫలితం విషయంలో మాత్రం షేకైపోయినట్లే కనిపించాడు.
ఈ సినిమా రిలీజ్ తర్వాత కొన్ని రోజులకు జరిగిన సైమా వేడుకల్లో మాట్లాడుతున్నపుడు ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ కనిపించాడు విజయ్. ‘లైగర్’ పేరెత్తకుండా ఆ సినిమా ఫలితం కలిగించిన నిరాశ గురించి ప్రస్తావించాడు. ఐతే నేరుగా ‘లైగర్’ రిజల్ట్ గురించి ఇప్పటిదాకా అతను ఎక్కడా మాట్లాడలేదు. లైగర్ నష్టపరిహారం విషయంలో దర్శక నిర్మాత పూరి జగన్నాథ్‌కు, బయ్యర్లకు మధ్య జరుగుతున్న గొడవ గురించి కూడా తనకేమీ పట్టనట్లు ఉండిపోయాడు.
ఐతే తాజాగా విజయ్ ఒక ఇంగ్లిష్ డైలీతో ‘లైగర్’ రిజల్ట్ గురించి ఓపెన్ అయ్యాడు. “లైగర్ లాంటి పెద్ద సినిమాలో నటించడం గొప్ప అవకాశం. ఇందులో నత్తి పాత్రను ఆస్వాదించాను. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు దేశమంతా తిరగడం, ప్రచారం చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చింది. ‘లైగర్’ కోసం శారీరకంగా, మానసికంగా ఎంత కష్టపడాలో అంతా పడ్డాను. నేను చేయగలిగిందంతా చేశా. కానీ ఫలితం దక్కలేదు. తప్పు చేయడం అంటే తెలియని విషయాన్ని నేర్చుకోవడమే. ఒకవేళ ఎవరైనా తప్పు చేయట్లేదంటే. వాళ్లు ఉన్నత స్థానం కోసం గట్టిగా ప్రయత్నించట్లేదనే అర్థం. సక్సెస్ వచ్చినా రాకపోయినా ప్రయత్నం మానకూడదు. అనుకున్న ఫలితం రాకపోయినా ముందుకెళ్లడం ఆపను. జీవితంలో జయాపజయాలు సహజం’’ అని విజయ్ స్పష్టం చేశాడు. విజయ్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఖుషి’ మూవీకి సమంత అనారోగ్యం వల్ల కాస్త బ్రేక్ పడింది.
This post was last modified on November 7, 2022 9:18 am
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…
కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో…
ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…