తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లను పుల్ చేయగల సామర్థ్యం ఉన్న అతి కొద్దిమంది హీరోయిన్లలో సమంత ఒకరు. యు టర్న్, ఓ బేబీ లాంటి సినిమాలో వాటి స్థాయిలో మంచి వసూళ్లే సాధించాయి. ఆమె ప్రధాన పాత్రలో శాకుంతలం అనే భారీ చిత్రంతో పాటు యశోద అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. హరి-హరీష్ అనే తమిళ దర్శక ద్వయం రూపొందించిన యశోద వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
కొంచెం పెద్ద బడ్జెట్లోనే తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ సమంతనే. ఆమె పేరు మీదే సినిమాకు క్రేజ్ వచ్చింది. బిజినెస్ జరిగింది. ఐతే విడుదల ముంగిట ప్రమోషన్లకు సమంత అందుబాటులో లేకుండా పోవడం చిత్ర బృందానికి పెద్ద ఎదురు దెబ్బే. మయోసిటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతూ సమంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆసుపత్రి నుంచే ఆమె ఒక ఫొటో కూడా షేర్ చేసింది. ఆమె కోలుకోవడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టేలా ఉంది.
దీంతో ప్రమోషన్లలో ఇప్పటిదాకా సమంత ఎక్కడా కనిపించలేదు. మామూలుగా సమంత ఉంటే ఇంకే రకమైన ప్రమోషన్ అవసరం లేదు. ఆమె ఒక్కత్తే కావాల్సినంత బజ్ తీసుకురాగలదు. కానీ ఆమె అందుబాటులో లేకపోవడంతో సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్‌లతో పాటు యాక్షన్ కొరియోగ్రాఫర్, దర్శకులు ఒక్కొక్కరుగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఆ ప్రమోషన్ సినిమాకు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో సమంత పెద్ద మనసుతో ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ కొంచెం వీలుచేసుకుని యాంకర్ సుమతో ఒక వీడియో ఇంటర్వ్యూ చేయడానికి సమంత సిద్ధమైందట. తన అనారోగ్య సూచనలు కనిపించకుండా ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సమాచారం నిజమే అయితే మాత్రం సామ్ కమిట్మెంట్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
This post was last modified on November 6, 2022 6:09 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…