సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటపుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. సినిమా హీరోలు, క్రికెట్ స్టార్ల అభిమానులను బాధ పెట్టేలా ఏవైనా ట్విట్టర్ హ్యాండిల్స్ పోస్టులు వేశాయంటే జరిగే డ్యామేజ్ మామూలుగా ఉండదు. ఇప్పుడు అదే అనుభవాన్ని నెట్ ఫ్లిక్స్ ఎదుర్కొంటోంది.
అసలే కొంత కాలంగా సబ్‌స్క్రిప్షన్లు తగ్గి, భారీగా ఆదాయం కోల్పోతూ ఇబ్బంది పడుతున్న ఆ సంస్థ.. ఉన్న నెగెటివిటీ చాలదని ప్రభాస్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చేలా ఒక పోస్టు పెట్టింది. ‘సాహో’ సినిమాలో ప్రభాస్ కొండ మీద నుంచి లోయలోకి దూకే షాట్ తాలూకు స్క్రీన్ షాట్ పెట్టి.. ఇదేం విన్యాసం అంటూ వ్యంగ్యంగా ఒక కామెంట్ పెట్టింది.
కాకపోతే ఈ పోస్టు పెట్టింది నెట్ ఫ్లిక్స్ ఇండొనేషియా విభాగం. ఇండొనేషియా భాషలోనే ఇంగ్లిష్ అక్షరాలతో ఆ పోస్టు పెట్టారు. దీనికి గూగుల్లో అర్థం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులకు మంటెత్తిపోయింది.
ఆ కామెంట్ వ్యంగ్యంగా ఉండడం, ‘సాహో’ సినిమాను, ప్రభాస్‌ను కించపరుస్తున్నట్లు అనిపించడంతో వారు నెట్ ఫ్లిక్స్ మీద యుద్ధం ప్రకటించేశారు. నిన్నట్నుంచి ‘అన్‌సబ్‌స్క్రైబ్ నెట్ ఫ్లిక్స్’ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను వదులుకుంటున్న స్క్రీన్ షాట్లను వేలాది మంది పోస్ట్ చేశారు. ‘
సాహో’ ఎంతో కష్టపడి చేసిన సినిమా. యాక్షన్ పరంగా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను అది ఎంతగానో పెంచింది. కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని ఉండొచ్చు. ఇలాంటివి హాలీవుడ్ సినిమాల్లోనూ చూడొచ్చు. అలాంటపుడు ప్రభాస్ సినిమాను ఇలా టార్గెట్ చేయడం ఏంటి అనే ప్రశ్నలు అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి యథాలాపంగా వేసిన ఒక ట్వీట్ వల్ల ‘నెట్ ఫ్లిక్స్’ జరుగుతున్న డ్యామేజీ చాలా పెద్దది అనే చెప్పాలి.
This post was last modified on November 6, 2022 2:21 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…