ఆర్ఆర్ఆర్ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో ఇకపై తన ప్రతి సినిమా వివిధ దేశాల్లో విస్తృత స్థాయిలో మార్కెటింగ్ చేయబడుతుందని గుర్తించిన రామ్ చరణ్ దానికి తగ్గట్టే లైనప్ ని సెట్ చేసుకుంటున్నాడు. మాములుగా ఎవరైనా దర్శకుడికి మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నిలబెట్టుకుంటాడనే అభిప్రాయాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టుని వదులుకుని మార్చేశాడు. దానికి ప్రత్యేకంగా కారణాలేంటనేది ఇటు చరణ్ కానీ అటు గౌతమ్ కానీ ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చిన సందర్భంలో వాళ్ళుగా చెబితే తప్ప బయటకి రాదు.
ప్రస్తుతం తన పదిహేనో సినిమాని శంకర్ తో చేస్తున్న చరణ్ ఆ తర్వాత సుకుమార్ తో చేతులు కలపడం దాదాపు కన్ఫర్మేనేనని ఇన్ సైడ్ టాక్. ఇటీవలే నిర్మాత అభిషేక్ అగర్వాల్, ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, సుక్కులు కలుసుకుంది దీనికోసమేననే ప్రచారం బలంగా ఉంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో ఊర మసాలా అండ పోలీస్ యాక్షన్ డ్రామాల స్పెషలిస్ట్ గా పేరున్న రోహిత్ శెట్టి సైతం చరణ్ తో ఓ ప్యాన్ ఇండియా మూవీ చేయాలనే ప్రతిపాదనతో త్వరలో కలవబోతున్నాడని ముంబై న్యూస్. హిందీ తెలుగు నుంచి రెండు బడా బ్యానర్లు ఇందులో భాగమవుతాయని వినికిడి.
ఒకవేళ ఇదే జరిగితే చరణ్ ని రోహిత్ శెట్టి ఎలా చూపిస్తాడోననే ఆసక్తి కలగడం సహజం. సింగం, సింబా, సూర్యవంశీ లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్లే కాదు చెన్నై ఎక్స్ ప్రెస్ లాంటి కామెడీ మూవీస్ ని సైతం స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్లు కొట్టిన అనుభవం రోహిత్ శెట్టిది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ కోసం భారీ బడ్జెట్ తో పోలీస్ బ్యాక్ డ్రాప్ లోనే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాడు. అయితే మెగా పవర్ స్టార్ ఇంకా కథ వినలేదు కాబట్టి ఇది ఓకే అవుతుందా లేదా అని చెప్పడానికి కొంత టైం పడుతుంది. ఇంతకీ శంకర్ సినిమా రిలీజ్ 2023లోనే ఉంటుందా అంటే ప్రస్తుతానికి డౌటేనని సమాచారం.
This post was last modified on November 6, 2022 8:13 pm
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…