ఒక కుటుంబంలో జరిగే ఈవెంట్ కి ఆ ఫ్యామిలీ లో ఎవరైనా హీరో రాకపోయినా , లేదా తమ్ముడి సినిమాలకు ప్రచారం చేయకపోయినా వారి మధ్య గొడవలు ఉన్నాయనే టాక్ స్ప్రెడ్ అవుతుంది. తాజాగా బన్నీ – శిరీష్ ల మధ్య ఇలాంటి గొడవేదో ఉందని సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. దీనికి తగ్గట్టే బన్నీ శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాకు సంబంధించి ఎలాంటి ట్వీట్ పెట్టకపోవడంతో అల్లు బ్రదర్స్ మధ్య మాటలు లేవని కన్ఫర్మ్ చేసేసుకున్నారు.
అయితే తాజాగా ఈ విషయంపై అల్లు శిరీష్ రియాక్ట్ అయ్యాడు. బన్నీ తన సినిమా గురించి ట్వీట్ చేయకపోవడం వెనుక ఉన్న సంగతి బయటపెట్టాడు. “అసలు ట్వీట్ చేస్తేనే ప్రేమ ఉన్నట్టా ? అన్ని విషయాలకు ట్వీట్ ఎందుకు ? ఏదైనా స్పెషల్ అకేషన్ కి పెట్టలేదంటే అనుకోవాలి కానీ సినిమాలకు కూడా ట్వీట్ చేయాలనే డిమాండ్ ఏంటి ? అలా చేయకపోతే గొడవలు ఉన్నట్టా ? ఇది నేను బన్నీ బ్రేక్ చేద్దాం అనుకున్నాం. అందుకే ఏదైనా స్పెషల్ అకేషన్ కి తప్ప నేను బన్నీ గురించి ట్వీట్ చేయను , తను కూడా అంతే.
బన్నీ సినిమా సక్సెస్ ఈవెంట్ కి వస్తున్నాడు. మాకు ఎలాంటి గొడవలు లేవని మేము చెప్పుకోనవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో కొందరు పెట్టే పోస్టులు పెద్దగా పట్టించుకోనని అందులో 90 మెసేజ్ లు పాజిటివ్ గా ఉంటే ఓ పది మాత్రం ఇబ్బంది పెట్టి మన మూడ్ మారేలా చేస్తాయని అందుకే సోషల్ మీడియాకి వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాని శిరీష్ చెప్పుకున్నాడు. మరి రేపు బన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన బ్రదర్స్ మధ్య ఇష్యు గురించి ఏమైనా రియాక్ట్ అవుతాడా ? లేదా సినిమా ను టీం ని అభినందించి వెళ్ళిపోతాడా ? లెట్స్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on November 5, 2022 10:28 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…