నిన్న విడుదలైన ఊర్వశివో రాక్షసివో పాజిటివ్ టాక్ వచ్చి అన్నింటిలోకి బెటర్ గా వసూళ్లు రాబడుతోంది. కమర్షియల్ స్కేల్ ఏంటనేది ఇంకో రెండు మూడు రోజులు ఆగితే తెలుస్తుంది కానీ అనుకున్న దానికంటే మంచి రెస్పాన్సే కనిపిస్తుండటంతో గీతా టీమ్ వెంటనే అలెర్ట్ అయిపోయింది. ప్రమోషన్ పరంగా ఈ అవకాశాన్ని కనక సరిగ్గా వాడుకునే శిరీష్ కి శ్రీరస్తు శుభమస్తు కన్నా పెద్ద హిట్టు వచ్చే అవకాశం ఉండటంతో పబ్లిసిటీ వేగాన్ని పెంచబోతోంది. అందులో భాగంగానే రేపు హైదరాబాద్ జెఆర్సి కన్వెన్షన్ లో భారీగా సక్సెస్ మీట్ ఒకటి సెట్ చేస్తున్నారు. దీనికో విశేషం ఉంది.
ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పటి నుంచి మొదలు టీజర్, ట్రైలర్, ఆఖరికి రిలీజ్ డేట్ వచ్చినా సరే అన్నయ్య అల్లు అర్జున్ దీనికి సంబంధించి ఎలాంటి ట్వీట్ వేయడం మాట్లాడ్డం కానీ జరగలేదు. దీని మీద ఫ్యాన్స్ కూడా చర్చించుకున్నారు. స్వంత తమ్ముడికి సపోర్ట్ ఇవ్వొచ్చుగా అనే కోణంలో సోషల్ మీడియా డిస్కషన్స్ జరిగాయి. ఫైనల్ గా వాటికి చెక్ పెడుతూ రేపు ముఖ్య అతిథిగా బన్నీనే రాబోతున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. అఫీషియల్ గానూ చెప్పబోతున్నారు. ఈ మధ్య తరచుగా కొన్ని ఈవెంట్లల కనిపిస్తూ వచ్చిన బన్నీ తమ్ముడి వేడుకకు రావడమంటే ఫ్యాన్స్ కి స్పెషలే.
నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ దీని గురించే చూచాయగా హింట్ ఇచ్చారు. వస్తాడన్నట్టుగానే శిరీష్ తో చెప్పించారు. ఒకవేళ ఫ్లాప్ అయ్యుంటే ఇదంతా జరిగేది కాదు కానీ యూత్ నుంచి ఊర్వశివోకు వచ్చిన స్పందన గీతా బృందానికి సడన్ కిక్ ఇచ్చేసింది. ఇంతకీ అల్లు అర్జున్ సినిమా చూశాడా అంటే రాత్రికి స్పెషల్ స్క్రీనింగ్ ప్లాన్ చేశారట. గత వారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య ఈ సినిమాలో రొమాన్స్ కంటెంట్ గురించి ఓపెన్ గా మాట్లాడినట్టు బన్నీ కూడా ఏమైనా చెబుతాడేమో చూడాలి. కౌంట్ పరంగా స్క్రీన్లు గట్టిగానే దక్కించుకున్న ఊర్వశివో రాక్షసివో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏడు కోట్లని ట్రేడ్ టాక్.
This post was last modified on November 5, 2022 4:02 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…