waltair veerayya
నెల కిందట గాడ్ ఫాదర్ సినిమాతో సందడి చేశాడు మెగాస్టార్ చిరంజీవి. దసరా కానుకగా రిలీజైన ఈ చిత్రం ఆచార్య తాలూకు చేదు జ్ఞాపకాలను చాలా వరకు చెరిపివేసిందనే చెప్పాలి. తొలి వారాంతం వరకు ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. కాకపోతే ఆ తర్వాత సినిమా అనుకున్న స్థాయిలో బలంగా నిలబడలేకపోయింది.
ఓవరాల్‌గా ఈ సినిమా చిరుకు ఓ మోస్తరు ఫలితాన్నందించిందని చెప్పాలి. ఇక మెగా అభిమానుల దృష్టి వాల్తేరు వీరయ్య మీదికి మళ్లింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ రీమేక్ కావడం వల్ల ప్రి రిలీజ్ బజ్ పెద్దగా లేదు. అంతకుముందు ఆచార్య పరిస్థితి తెలిసిందే. వాల్తేరు వీరయ్య అన్ని రకాలుగా అభిమానులను అలరిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కథ గురించి సామాజిక మాధ్యమాల్లో ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతుండడం విశేషం.
వాల్తేరు వీరయ్యలో మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కథలో అతడి పాత్రకు చాలా ప్రాధాన్యమే ఉంటుందట. అతడిది చిరు సోదరుడి పాత్ర అని.. తన మీద ఒక అవినీతి ముద్ర పడి అప్రతిష్ట పాలైతే.. దాన్ని చెరిపివేసేందుకు చిరు చేసే ప్రయత్నమే ఈ సినిమా అని అంటున్నారు. చిరుకు ఎలివేషన్ ఇస్తూనే రవితేజ ప్రాధాన్యం కూడా తగ్గకుండా సినిమా ఉంటుందట. రవితేజ పాత్ర నిడివి దాదాపు 40 నిమిషాలు ఉంటుందట ఈ చిత్రంలో.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి వచ్చే నెలలో ఫస్ట్ కాపీ తీయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.
This post was last modified on November 5, 2022 5:33 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…