‘ఊర్వశివో రాక్షసివో’ ఫస్ట్ టీజర్ రిలీజైనపుడు అందులో హీరో హీరోయిన్లు అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయెల్‌ల కెమిస్ట్రీ చూసి అందరూ షాకైపోయారు. లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్లతో ఆ టీజర్ కుర్రాళ్లకు మంచి కిక్కిచ్చింది. శిరీష్, అనుల రొమాన్స్ అందులో చాలా సహజంగా అనిపించింది. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉన్నట్లుగా కనిపించింది.
తర్వాత ఈ సినిమా ప్రమోషన్ల టైంలో ఇద్దరూ కలిసి చేసిన ప్రమోషన్లు చూసి ఆఫ్ లైన్లోనూ వీరి మధ్య కెమిస్ట్రీ భలేగా వర్కవుట్ అవుతోందని.. ఇద్దరి మధ్య ఏదో ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. సినిమా రిలీజ్ టైంకి అవి మరింతగా విస్తరించాయి. ఇప్పుడు స్వయంగా అనునే సినిమా సక్సెస్ మీట్లో ఈ విషయం ప్రస్తావించడం విశేషం. తమ ఇద్దరి మధ్య ఏదో ఉందని వస్తున్న వార్తల గురించి స్వయంగా శిరీష్ తండ్రి అల్లు అరవిందే తన దగ్గర ప్రస్తావించినట్లు అను వెల్లడించడం గమనార్హం.
అల్లు అర్జున్‌తో కలిసి తాను ‘నా పేరు సూర్య’ సినిమా చేసినప్పటి నుంచి తనకు అల్లు ఫ్యామిలీతో అనుబంధం ఏర్పడిట్లు ఆమె వెల్లడించింది. ఐతే ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాలో తాను కథానాయికగా ఎంపిక అయ్యే సమయానికి శిరీష్‌తో తనకు పరిచయమే లేదని.. ఈ సినిమాను తాను అంగీకరించాక శిరీష్‌తో ఒక కాఫీ షాప్‌లో కలిసి తమ క్యారెక్టర్ల గురించి డిస్కస్ చేశామని.. ఆ తర్వాత తమ మధ్య ఏదో ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయని అను వెల్లడించింది.
మీడియాలో వచ్చే వార్తలు చూసి తన తల్లి కూడా కొంచెం కంగారు పడిందని, ఆమెకు కూడా తాను క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చిందని.. ఆ తర్వాత అల్లు అరవింద్ ఈ విషయాన్ని తన వద్ద సరదాగా ప్రస్తావించారని.. అప్పుడు తామిద్దరం నవ్వుకున్నామని అను తెలిపింది. శిరీష్ మంచి కోస్టార్ అని, తనతో పని చేయడం మంచి అనుభవం అని అను అభిప్రాయపడింది.
This post was last modified on November 5, 2022 1:37 pm
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…
కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో…
ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…