స్టార్ హీరోల పుట్టిన రోజులు, ఇంకేవైనా సందర్భాలు వస్తే వాళ్ల కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమాలను స్పెషల్ షోలుగా వేయడం ఈ మధ్య ఆనవాయితీగా మారుతున్న సంగతి తెలిసిందే. గతంలోనూ ఈ సంప్రదాయం ఉండేది కానీ.. ఈ మధ్య ఈ రీ రిలీజ్‌లు భారీ స్థాయిలో ఉంటున్నాయి. అందులోనూ కొత్త కొత్త రికార్డులు నమోదవుతున్నాయి.
హీరోల స్టార్ పవర్, బాక్సాఫీస్ స్టామినాకు రుజువులుగా ఈ లెక్కల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఐతే ఈ రికార్డుల పోటీ శ్రుతి మించి అక్కడా ఫేక్ నంబర్లు, రికార్డులు మొదలైపోవడంతో జనాలకు చిరాకు వస్తోంది. ఐతే ఇప్పుడు ఓ సినిమా రీరిలీజ్‌లో రికార్డులు., నంబర్ల గొడవ లేకుండా ప్రశాంతంగా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఆ చిత్రమే.. నువ్వే నువ్వే. ఇటీవలే ఈ చిత్రం 20 వసంతాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆ సందర్భంగా ఏఎంబీ మల్టీప్లెక్సులో చిత్ర బృందం వరకు స్పెషల్ షో వేశారు. అప్పుడు కొందరు మీడియా వాళ్లు, అభిమానులు కూడా హాజరు కాగా.. వారి నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ వీకెండ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ సిటీస్‌లో నువ్వే నువ్వే స్పెషల్ షోలు వేశారు. ఇందులో హీరోగా నటించిన తరుణ్ ఇప్పుడు లైమ్ లైట్లో లేదు. శ్రియ పనైపోయింది. చిత్ర బృందంలో మిగతా వాళ్లందరి కథా ముగిసింది. ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్నది త్రివిక్రమ్ మాత్రమే. ఆయనకున్న క్రేజ్‌తోనే నువ్వే నువ్వే రిలీజైంది.
ఇప్పుడు ఈ సినిమాకు హీరో త్రివిక్రమ్ అనే చెప్పాలి. ఆయన పేరు మీదే ఇన్ని షోలు పడ్డాయి. చాలా వరకు సినిమాకు మంచి ఆక్యుపెన్సీలే వచ్చాయి. హైదరాబాద్‌లో కొన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. ఒక దర్శకుడి కోసం ఇలా థియేటర్లకు జనాలు పెద్ద ఎత్తున రావడం విశేషమే. మాటల మాంత్రికుడి బాక్సాఫీస్ సత్తాకు ఇది నిదర్శనం అని చెప్పాలి.
This post was last modified on November 5, 2022 1:41 pm
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…