urvashi rautela
ఊర్వశి రౌతెలా.. సోషల్ మీడియా ఫాలోవర్లకు ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమెకు ఇన్‌స్టాగ్రాంలో ఏకంగా 60 మిలియన్ల దాకా ఫాలోవర్లు ఉన్నారంటే తన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఐతే ఈ ఫాలోయింగ్‌తో సినిమా అవకాశాలు సంపాదించింది కానీ.. హీరోయిన్‌గా అయితే ఎదగలేకపోయింది.
కథానాయికగా నటించిన సినిమాల కంటే బాలీవుడ్లో ఆమె చేసిన స్పెషల్ సాంగ్సే మంచి పేరు తెచ్చాయి. చాలా సినిమాల్లో వ్యాంప్ తరహా పాత్రలు చేసిన ఈ భామ.. ఇప్పుడు తెలుగులో కొత్త ఐటెం దేవతగా మారుతోంది. ఆల్రెడీ ‘బ్లాక్ రోజ్’ అనే సినిమాలో ఆమె చేసిన ‘నా తప్పు ఏమున్నదబ్బా’ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా సూపర్ హిట్టయింది. టిక్ టాక్, ఇన్‌స్టా రీల్స్‌ను ఊపేసింది.
ఐతే ఇప్పుడు ఊర్వశి వరుసగా పెద్ద పెద్ద సినిమాల్లో ఐటెం సాంగ్స్ అవకాశాలు అందుకుంటుండడం విశేషం. ఆల్రెడీ ఊర్వశి.. రామ్-బోయపాటి సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. రామ్‌తో కలిసి ఫొటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ఈ పాటలో తాను నర్తించిన విషయాన్ని ధ్రువీకరించింది ఊర్వశి.
ఇప్పుడు ఆమె ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఐటెం పాటలో మెరవబోతున్నట్లు సమాచారం. చిరు కొత్త చిత్రం ‘వాల్తేరు వీరయ్య’లో ఊర్వశి ఐటెం సాంగ్ కన్ఫమ్ అయింది. ఒక లావిష్ సెట్లో చిరు, ఊర్వశిల మీద ఈ పాట తీయడానికి దర్శకుడు బాబీ రెడీ అవుతున్నాడు. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చనున్నాడు. చూస్తుంటే ఊర్వశి తెలుగులో ఐటెం సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయ్యేలా కనిపిస్తోంది.
This post was last modified on November 5, 2022 10:53 am
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…