కొందరు దర్శకులకు సెపరేట్ ఇమేజ్ ఉంటుంది. తీసే సినిమాలను బట్టి వారికి ఫ్యాన్స్ ఉంటారు. తెలుగులో ఇంద్రగంటి మోహన కృష్ణ సినిమాలు ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆయన వరుస పెట్టి ఫ్లాపులు డెలివరీ చేస్తూ నిరాశ పరుస్తున్నాడు. ‘అష్టా చెమ్మా’ తో మొదలు పెట్టి ‘అమీ తుమీ’ వరకూ కుటుంబమంతా చూసే ఫ్యామిలీ సినిమాలు తీసి మెప్పించిన ఇంద్రగంటి ఇప్పుడు లెక్క తప్పుతున్నారు. ఆ మధ్య అల్లరి నరేష్ తో ‘బంది పోటు’ అనే సినిమా తీసి ఈవీవీ సినిమా బేనర్ కి ఫులి స్టాప్ పడేలా చేశాడు ఇంద్రగంటి.
సమ్మోహనం అనే డీసెంట్ మూవీతో కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ ‘వీ’ సినిమాతో తనకి సరిపడని జానర్ టచ్ చేసి డిజాస్టర్ డెలివరీ చేశాడు. సినిమా ఓటీటీ లో రిలీజైంది కాబట్టి దిల్ రాజు సేఫ్ అయ్యాడు. ఒకవేళ థియేటర్స్ లో రిలీజ్ చేస్తే భారీ నష్టాలు వచ్చేవి. ఇక తాజాగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ మళ్ళీ సినిమా నేపథ్యం ఉన్న కథతో సినిమా చేసి బోల్తా కొట్టాడు ఇంద్రగంటి. సినిమాలో హీరోయిన్ తో డ్యుయల్ రోల్ చేయించి సరదాగా కాకుండా సీరియస్ గా డీల్ చేసి దెబ్బ తిన్నాడు.
ఇలా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఇంద్రగంటి నెక్స్ట్ దిల్ రాజు బేనర్ లో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ తో ఓ సాఫ్ట్ సినిమా చేయాలని చూసినప్పటికీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి డిజాస్టర్ అవ్వడంతో విజయ్ ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఇంద్రగంటి దగ్గర కథ అయితే ఉంది కానీ హీరోనే లేడు. మరి దిల్ రాజు ఇంద్రగంటి కి ఏ హీరోని అప్పగిస్తాడో ? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.
This post was last modified on November 4, 2022 3:52 pm
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవలే బాలీవుడ్లోకి అరంగేట్రం చేసింది. తన తొలి హిందీ చిత్రం ‘బేబీ జాన్’…
సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో మొదటి రోజు ఆట ఉత్కంఠగా ముగిసింది. ఆసీస్ జట్టు…
అనంతపురంలో రాజకీయ రచ్చ రేగింది. కూటమి పార్టీల నేతల మధ్య మాటల మంటలు రేగాయి. ము ఖ్యంగా మాజీ ఎమ్మెల్యే…
గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ పోషిస్తున్న అప్పన్న పాత్ర మీద ట్రైలర్ లో పలు క్లూలు ఇచ్చారు కానీ…
సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో మొదటి రోజు ఆట ఉత్కంఠగా ముగిసింది. ఆసీస్ జట్టు…
బాలకృష్ణ - బాబీ కాంబోలో రూపొందిన డాకు మహారాజ్ మీద అభిమానుల ఆశలు ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తున్నాం. తమన్…