‘జాతిరత్నాలు’ తో బ్లాక్ బస్టర్ డెబ్యూ ఇచ్చి ప్రేక్షకుల గుండెల్లో చిట్టిగా ముద్ర వేసేసుకుంది ఫరియా అబ్దుల్లా. ఆ సినిమా బిగ్ హిట్ అవ్వడంతో రాత్రి కి రాత్రే స్టార్ అయిపోయింది. బోలెడన్ని ఆఫర్లతో పాటు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లో కూడా హంగామా చేసి మెల్లగా సెటిలైంది. అయితే అమ్మడు చేసింది రెండే సినిమాలే అయినప్పటికీ లక్కీ బ్యూటీ అని ట్యాగ్ వేసేసుకుంది. ‘జాతిరత్నాలు’ తో హీరోయిన్ గా సక్సెస్ అందుకున్న ఫరియా నాగార్జున -నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన ‘బంగార్రాజు’ లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సినిమా కూడా సంక్రాంతి బరిలో మంచి వసూళ్ళు అందుకొని సూపర్ హిట్ అనిపించుకుంది.
దీంతో ఫరియా పై ఇండస్ట్రీ లక్కీ బ్యూటీ అనే ముద్ర వేసేసింది. ఫరియా ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’ అనే సినిమాతో రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తనకి మరో హిట్ అందిస్తుందని భావిస్తుంది. సక్సెస్ కోసం టెన్షన్ పడుతూ గంటలు లెక్కపెడుతోంది. సినిమా పూర్తయ్యాక కూడా ప్రమోషన్స్ కి టైం ఇచ్చి హీరోతో పాటే సినిమాను ప్రమోట్ చేయడం ఫరియా లో చెప్పుకోదగిన మంచి లక్షణం. జాతిరత్నాలు కి కూడా ఆమె ప్రమోషన్ హెల్ప్ అయింది. ముఖ్యంగా ఆ టైంలో పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయిన విధానం అందరినీ ఆకట్టుకుంది. లైక్ షేర్ సబ్ స్క్రైబ్ ప్రమోషన్స్ లో కూడా యాక్టివ్ గా పాల్గొంటూ ఎట్రాక్ట్ చేసింది.
ప్రస్తుతం ఫరియా రవితేజ తో ‘రావణాసుర’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. రేపు లైక్ షేర్ సబ్ స్క్రైబ్ తో మరో హిట్ పడితే ఫరియా కి తెలుగులో మరిన్ని ఆఫర్లు వస్తాయి. యూనిట్ కూడా కంటెంట్ తో పాటు తమ సినిమాలో లక్కీ బ్యూటీ ఉందని ధీమాగా ఉంది. చూడాలి మరి ఈ తెలుగమ్మాయి మరో సక్సెస్ అందుకుంటుందో లేదో ?
This post was last modified on November 4, 2022 8:26 am
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…