గాడ్‌ఫాదర్ అనగానే ఇప్పుడు అందరూ మెగాస్టార్ చిరంజీవి సినిమాగానే చూస్తున్నారు. ఒక వీడియో ఇంటర్వ్యూలో యువ దర్శకుడు అనుదీప్ కేవీ తనకు ‘గాడ్ ఫాదర్’ సినిమా బోర్ కొట్టింది అని కామెంట్ చేయగానే మెగా ఫ్యాన్స్‌కు కోపం వచ్చేస్తోంది. కానీ డొంకతిరుగుడుగా మాట్లాడి చివర్లో ట్విస్ట్ ఇవ్వడం అలవాటైన అనుదీప్.. ఈ విషయంలోనూ అలాంటి ట్విస్టే ఇచ్చాడు.
అతడికి బోర్ కొట్టింది మెగాస్టార్ మూవీ కాదట. ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప చిత్రాల్లో ఒకటిగా చెప్పుకునే హాలీవుడ్ క్లాసిక్ ‘గాడ్ ఫాదర్’ అట. ప్రపంచ సినిమాను అర్థం చేసుకోవాలన్నా.. సినీ రంగంలో ఏదైనా సాధించాలని వచ్చినా ముందు ‘గాడ్ ఫాదర్’ సినిమా చూడాలని సినీ పండితులు చెబుతుంటారు. రామ్ గోపాల్ వర్మ సహా ఎందరో దిగ్గజ దర్శకులకు ఈ క్లాసిక్ స్ఫూర్తిగా నిలిచింది. కానీ అనుదీప్‌కు మాత్రం ఈ సినిమా బోర్ కొట్టిందట.
ఇటీవలే ‘ప్రిన్స్’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన అనుదీప్.. తాజాగా ఒక వీడియో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ‘గాడ్ ఫాదర్’ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘తాను సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నాక చాలా ఏళ్ల పాటు ‘గాడ్ ఫాదర్’ చూడలేదని.. ఐతే చాలామంది ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయారని.. గాడ్ ఫాదర్ చూడలేదా అంటూ షాకవుతూ అడిగారని.. దీంతో తాను ఆ సినిమా చూశానని అనుదీప్ చెప్పాడు. కానీ ఆ సినిమా తనకు బోర్ కొట్టిందంటూ కుండబద్దలు కొట్టేశాడతను. ఈ సినిమా తనకు నచ్చలేదని కూడా తీర్మానించేశాడు.
ఐతే ‘గాడ్ ఫాదర్’ అంటే హాలీవుడ్ మూవీ అని చెప్పకుండా ఈ సినిమా బోర్ కొట్టిందని అనడంతో యాంకర్ ఆశ్చర్యపోయి చిరంజీవి సినిమా మీకు నచ్చలేదా అని అడిగితే.. తాను చెబుతోంది ఈ ‘గాడ్ ఫాదర్’ కాదని, హాలీవుడ్ ‘గాడ్ ఫాదర్’ అని చావు కబురు చల్లగా చెప్పాడు అనుదీప్. ‘గాడ్ ఫాదర్’ నచ్చలేదన్నా అదో పెద్ద పాపం లాగా చూస్తారని, కానీ తనకైతే ఆ సినిమా నచ్చలేదని తేల్చేశాడు అనుదీప్.
This post was last modified on November 4, 2022 8:17 am
తండేల్ ప్రమోషన్లలో భాగంగా అల్లు అరవింద్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మగధీర తన మేనల్లుడు రామ్ చరణ్ కు ఎలాగైనా…
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ప్రత్యేక…
ఆస్ట్రేలియా జట్టు ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో స్ట్రాంగ్ టీమ్ గా రాబోతోంది అనుకుంటున్న టైమ్ లో ఊహించని పరిణామాలు…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…