మాములుగా తమ అభిమాన హీరో వరసగా సినిమాలు చేయడం కన్నా ఫ్యాన్స్ కి కావలసింది ఏముంది. తెలుగులో చూస్తేనేమో ఏడాదికి ఒకటి చేయడమే మహా భారంగా స్టార్లు ఫీలవుతున్న ట్రెండ్ లో అక్షయ్ కుమార్ వరసగా ప్రాజెక్టులు ఓకే చేయడం పట్ల సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. ఇతను పెద్దగా మార్కెట్ లేని చిన్నవాడైతే పోన్లే ఎన్ని చేస్తే ఏముంది ఎవరు పట్టించుకుంటారని అనుకోవచ్చు. కానీ అక్కి కేసు అలా కాదు. ఎంతలేదన్నా ఒక్కో చిత్రానికి వంద కోట్లకు పైగా మార్కెట్ ముడిపడి ఉంది. అలాంటిది స్టోరీ సెలక్షన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
2021లో సూర్యవంశీ సూపర్ హిట్ అయ్యాక అక్షయ్ కుమార్ డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్లు సాధించాడు. ఓటిటిలో నేరుగా వచ్చిన అత్రంగీరే,కట్ పుత్లీ(రాక్షసుడు రీమేక్) రెండూ నెగటివ్ రివ్యూస్ తెచ్చుకున్నాయి. గద్దలకొండ గణేష్ హిందీ రూపం బచ్చన్ పాండే మరీ దారుణంగా వారంకే టపా కట్టేస్తే యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రెస్టీజియస్ గా నిర్మించిన సామ్రాట్ పృథ్విరాజ్ ఆ సంస్థకు నికరంగా నూటా యాభై కోట్లకు పైగా హారతి కర్పూరం చేసింది. ఇక రక్షా బంధన్ సంగతి సరేసరి. ఇటీవలే రాముడి సెంటిమెంట్ ని వాడుకుందామని చూసిన రామ్ సేతు సైతం డిజాస్టర్ ముద్రను తప్పించుకోలేదు.
ఇన్ని జరిగినా మళ్ళీ అక్షయ్ కుమార్ తనకు సూట్ కాని పాత్రలనే ఎంచుకుంటున్నాడు. వీర్ దౌడ్లే సాత్ అనే మరాఠి కం హిందీ మూవీలో ఛత్రపతి శివాజీ పాత్ర చేస్తున్నాడు. ఇది మాత్రం వద్దు బాబోయ్ అని ఫ్యాన్స్ మొత్తుకుంటున్నారు. ఇలాంటి చారిత్రాత్మక క్యారెక్టర్స్ కు అక్షయ్ సూట్ కాడని అనవసరమైన ట్రోలింగ్ తప్ప వచ్చే ప్రయోజనం ఏమి ఉండదని అంటున్నారు. అయినా అక్షయ్ వింటేగా. నా దారి నాదే నాకు కౌంట్ ముఖ్యం కానీ కంటెంట్ కాదనే రీతిలో వ్యవహరిస్తున్న తీరు ట్రేడ్ నుంచి సైతం కామెంట్స్ తెచ్చి పెడుతోంది. అలా డిసైడైనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు.
This post was last modified on November 4, 2022 8:52 am
రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…