కొంతమంది హీరోలు ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా కూడా పోగొట్టుకున్న చోటనే రాబట్టుకోవాలి అన్న చందాన అదే ప్రయత్నం మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. కాకపోతే కొందరు రాబడతారు, కొందరు ఫెయిలవుతారు. ఇప్పుడు హీరో శర్వానంద్ కూడా.. తనకు ఇప్పటివరకు పెద్దగా కలసిరాని అదే జానర్‌తో మరోసారి తన సత్తా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ మధ్యనే సినిమా రిలీజై రివ్యూస్ అన్ని బాగున్నా కూడా, ‘ఒకే ఒక జీవితం’ సినిమాకు కలక్షన్లు అనుకున్నంత రాకపోవడంతో.. ఇప్పుడు ఈ ‘రన్ రాజా రన్’ కూడా పాత రూట్లోనే వెళ్తున్నాడట.
మొన్నామధ్యన ఒకే ఒక జీవితం సినిమా ప్రమోషన్లలో భాగంగా.. తన తదుపరి సినిమా.. రౌడీ ఫెలో మూవీ ఫేం కృష్ణచైతన్యతో చేస్తున్నట్లు శర్వా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాకపోతే ఒకే ఒక జీవితం రిజల్ట్ చూసిన వెంటనే.. ఆ సినిమాను ఆపేశాడు. ఆ తరువాత ఏం సినిమా చేస్తాడా అనుకుంటుంటే.. ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా మనోడు ఒక కొత్త సినిమా ఓకే చేశాడని తెలుస్తోంది. ఒక ప్రముఖ డైరక్టర్ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన ఒక కొత్త డైరక్టర్ డైరక్షన్లో ఈ సినిమాను చేస్తున్నాడు. అంతేకాదు ఇదొక మాస్ సినిమా అని తెలుస్తోంది. రీసెంట్‌గా మహాసముద్రం సినిమతో శర్వా మాస్ ప్రయత్నించిగా బెడసి కొట్టింది. అయినాసరే కాంతారా వంటి మాస్ సినిమాలు ఆడేస్తున్నాయ్ కాబట్టి, ఒకే ఒక జీవితం వంటి సాఫ్ట్ సినిమాలు ఆడలేదు కాబట్టి, శర్వా గట్టిగా మళ్ళీ మాస్‌తోనే కొట్టాలని డిసైడైపోయాడట.
నిజానికి మాస్ సినిమాలు చేస్తే ఆడవు అని చెప్పలేం కాని, ఈ మధ్య కాలంలో మరీ 90లలో తీసిన లాజిక్ లేని హీరోయిజం కాన్సెప్టులతో వచ్చిన సినిమాలు నిరుత్సాహపరిచాయి. నితిన్ చేసిన మాచర్ల నియోజకవర్గం, గోపిచంద్ పక్కా కమర్షియల్ ఆ కోవకు చెందినవే. అదే కొత్తగా చిన్న కాన్సెప్టు పట్టుకుని మాస్ సినిమా తీసినా, కాంతారా వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయ్. మాస్ సినిమా అయినా క్లాస్ సినిమా అయినా.. ఎంగేజింగ్‌గా ఉంటే ఆడియన్స్ చూస్తారు. లేదంటే రిజక్ట్ చేస్తారు. చూద్దాం మరి శర్వానంద్ ఈసారేం చేస్తాడో!
This post was last modified on November 4, 2022 8:52 am
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్లోని అమృత్సర్కు ప్రత్యేక…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…