మేజర్ దేశవ్యాప్త బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత అడవి శేష్ కు ఇండియా వైడ్ గుర్తింపు వచ్చేసింది. ఇంతకు ముందంటే కేవలం తెలుగు మార్కెట్ నే దృష్టిలో పెట్టుకుని కథలు ఎంపిక చేసుకునేవాడు కాబట్టి క్షణం లాంటి ఇన్స్ ఫైర్డ్ మూవీ, ఎవరు లాంటి రీమేక్ రెండూ ఆడియన్స్ దగ్గర పాసైపోయాయి. ఇకపై అలా ఉండదు. నిర్మాతలు తనతో చేసే సినిమాలను దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకునేందుకు చూస్తారు. డబ్బింగ్ హక్కులకు మంచి డిమాండ్ ఉంటుంది. రీమేక్ కన్నా అనువదించడం ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి ఆ కోణంలోనే బిజినెస్ డీల్స్ జరుగుతాయి.
ఇప్పుడీ ప్రస్తావనకు కారణముంది. ఉదయం హిట్ 2 ది సెకండ్ కేస్ టీజర్ వచ్చింది. ఏఎంబి మాల్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. కంటెంట్ సాలిడ్ గానే ఉంది. స్టోరీ పరంగా మరీ విభిన్నంగా ఏమీ అనిపించలేదు కానీ వీడియో చివర్లో చూపించిన అమ్మాయి డెత్ సీన్ తాలూకు విజువల్ మాత్రం సెన్సిటివ్ జనాలకు ఇబ్బంది కలిగించేలానే ఉంది. నేలపై యువతి శవాన్ని ముక్కలుగా విడగొట్టి పడుకోబెట్టిన తీరు క్రియేటివిటీ కోణంలో బాగుండొచ్చు కానీ శేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ పెరిగిన నేపథ్యంలో ఇంతటి హింసను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అనేది అనుమానమే
ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ కథల్లో ఉన్నట్టుగానే మెయిన్ ప్లాట్ కనిపిస్తోంది. కనిపించకుండా దారుణంగా హత్యలు చేసే ఒక సైకో కిల్లర్, చూసేందుకు జుగుప్సగా అనిపించే రీతిలో శవాలను పోలీసులకు అందించే తీరు కమల్ హాసన్ ఎర్రగులాబీల నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు దాకా ఎన్నో వచ్చాయి. వాటిలో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి.ఫ్లాపులు పడ్డాయి. వెబ్ సిరీస్ లు వచ్చాక వీటి తాకిడి మరింత ఎక్కువగా పెరిగింది. మరి హిట్ 2లో దర్శకుడు శైలేష్ కొలను ఎలాంటి ట్విస్టులు పెట్టాడో చూడాలి. హిట్ 1 హిందీలో డిజాస్టరైన నేపథ్యంలో ఇప్పడీ సీక్వెల్ ని హిందీలో డబ్ చేసే అవకాశాలు ఎక్కువ
This post was last modified on November 3, 2022 4:53 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…