Movie News

సమంత బాధ.. యూట్యూబర్లకు పండగ

Samanthaకు వచ్చిన అరుదైన వ్యాధి గురించి తెలుసుకుని ఆమె అభిమానులు ఎంతో బాధ పడుతున్నారు. ఇండస్ట్రీ జనాలు కూడా ఆమెకు ఓదార్పును, తమ వంతు సహకారాన్ని అందించే ప్రయత్నంలో ఉన్నారు. సమంతకు వచ్చిన జబ్బు మరీ ప్రమాదకరం కాదు. అలా అని తేలిగ్గా తీసుకునేది కూడా కాదు. సరైన చికిత్స అందితే ఆమె దాన్నుంచి బయటపడుతుంది. వైద్యులు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు.

ఐతే Samantha పై సానుభూతి చూపాల్సింది పోయి.. ఇదే అదనుగా యూట్యూబ్ ఛానెళ్లు వ్యూస్ కోసం దిగజారిపోయి ప్రవర్తిస్తుండడం షాకింగ్. ఫిలిం సెలబ్రెటీల గురించి దారుణమైన థంబ్ నైల్స్ పెట్టడం.. తీరా వీడియో ఓపెన్ చేస్తే అందులో ఏ విషయం లేకపోవడం.. ఇదంతా అందరికీ తెలిసిన వ్యవహారమే. వీడియోల్లో ఏమీ ఉండదని తెలిసి కూడా థంబ్ నైల్ చూసి అట్రాక్ట్ అయ్యేవాళ్లు చాలామంది ఉంటారు. వీరి బలహీనతే యూట్యూబ్ ఛానెళ్లకు పెట్టుబడిగా మారుతోంది.

1 / 8

ఇప్పుడు Samantha అనారోగ్యం మీద చిత్ర విచిత్రమైన థంబ్ నైల్స్ పెట్టి పబ్బం గడుపుకునే పనిలో పడ్డాయి యూట్యూబ్ ఛానెళ్లు. సమంత అనారోగ్యం గురించి తెలిసి నాగచైతన్య ఆమెకు ఫోన్ చేశాడట.. అయ్యో సామ్ నావల్లే ఇదంతా అయింది అని పశ్చాత్తాప పడ్డాడట.. ఈ టైంలో ఎక్కడో ఉండడం కరెక్ట్ కాదు, ఇంటికి వచ్చేయ్ అన్నాడట.. ఆమె కోసం గుడికి వెళ్లాడట.. అమెరికాలో తనకు తెలిసిన డాక్టర్‌తో మాట్లాడాడట.. చైతూ ఆసుపత్రికి వెళ్తుంటే నాగ్ టెన్షన్ పడ్డాడట.. ఆసుపత్రికి వెళ్లిన చైతూకు అవమానం ఎదురైందట.. ఇలా ఎన్నెన్నో అర్థాలతో థంబ్ నైల్స్ పెట్టి పండగ చేసుకుంటున్నాయి యూట్యూబ్ చానెల్స్.

కేవలం చైతూతో సరిపెట్టకుండా అఖిల్ తన మాజీ వదినను ఇంటికి వచ్చేయమన్నాడని.. ఎన్టీఆర్ సమంత పరిస్థితి చూసి అయ్యో అనుకున్నాడని.. రామ్ చరణ్, ఉపాసన సమంత కోసం ఆసుపత్రికి పరుగులు పెట్టారని.. సమంతను ఉపాసన అమ్మలా చూసుకుందని.. ఇలా ఎన్నెన్నో థంబ్ నైల్స్ ఇప్పుడు యూట్యూబ్‌ను ముంచెత్తుతున్నాయి. ఇంతకుముందు Samantha విడాకుల విషయంలో కూడా ఈ ఛానెళ్లు ఇలాగే దిగజారి ప్రవర్తించాయి. ఇప్పుడు మరింత శ్రుతి మించాయి. ఈ థంబ్ నైల్స్ చూసి జనాలకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు.

This post was last modified on November 3, 2022 4:57 pm

Share

Recent Posts

అది నిజ‌మైతే.. వైసీపీ ఖాళీ అవుతుందా?

వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాట‌లు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్న‌ట్టుగానే పార్టీ అధినేత జ‌గ‌న్…

2 hours ago

గీత గోవిందం దర్శకుడికి బ్రేక్ దొరికింది

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…

4 hours ago

మంత్రి ఎదుట జెండాలు పట్టుకుని రోబోల నిరసన..!

"హలో... ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!" రజనీకాంత్ రోబో సినిమాలో…

5 hours ago

సూర్యని ఊరిస్తున్న ట్రిపుల్ మైలురాయి

మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…

5 hours ago

ర‌వితేజ కొడుకు… యాక్టింగ్ కోస‌మే డైరెక్ష‌న్

టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే…

6 hours ago

ప్ర‌పంచ‌పు వింత అంటే ఇదే: యువ‌కుడికి గ‌ర్భాశ‌యం!

మ‌హిళ‌లు మీసాలు పెంచ‌లేర‌ని.. పురుషులు గ‌ర్భాన్ని దాల్చ‌లేర‌ని సామెత‌!. అయితే.. ఇటీవ‌ల కాలంలో ర‌ష్యాకు చెందిన ఓ మ‌హిళ మీసాలు…

8 hours ago