కంటెంట్ ఎక్కడ వీరయ్య ?

బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ కి సంబంధించి లేటెస్ట్ గా టైటిల్ ఎనౌన్స్ చేస్తూ టీజర్ వదిలిన సంగతి తెలిసిందే. ఉన్నపళంగా సినిమాను సంక్రాంతి బరిలో దింపాలనే నిర్ణయంతో ప్రమోషన్స్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు మేకర్స్. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. అవును వీరయ్య టైటిల్ చెప్తూ వచ్చిన ఒక్క మోషన్ పోస్టర్ టీజర్ తప్ప ఇంకా ఈ సినిమా నుండి ఎలాంటి కంటెంట్ రివీల్ చేయలేదు.

ఒక వైపు సంక్రాంతి పోటీలో బాలయ్య సినిమా నుండి ఇప్పటికే మంచి కంటెంట్ వచ్చేసింది. సినిమాలో ఉండే యాక్షన్ గ్లిమ్స్ , పవర్ ఫుల్ డైలాగ్ తో కథ గురించి క్లుప్తంగా చూపిస్తూ టీజర్ వదిలేశారు. ఆ టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. వీరయ్య -వీర సింహా రెడ్డి పోటీ లో ఇప్పటి వరకూ కంటెంట్ తో ఇంప్రెస్ చేసింది బాలయ్యే. త్వరలోనే ఫస్ట్ సింగిల్ కూడా రాబోతుంది. డిసెంబర్ లో గట్టి ప్రమోషన్స్ చేయబోతున్నారు.

నిజానికి వాల్తేరు వీరయ్య మీద కూడా మంచి అంచనాలున్నాయి. చిరు వింటేజ్ లుక్ లో మాస్ గెటప్ తో కనిపిస్తూ ఆడియన్స్ ను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తారనే టాక్ ఉంది. సినిమాకు సంబంధించి టాక్ కూడా బాగుంది. కానీ ఆడియన్స్ ని ఎగ్జైట్ చేసే కంటెంట్ కూడా వదలడం మొదలు పెడితే బెటర్. ఓ వైపు మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఎంతో ఆతృతగా చూస్తున్నారు. దేవి సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయో అనే టెన్షన్ కూడా ఫ్యాన్స్ లో మొదలైంది. మరి వీరయ్య కంటెంట్ తో హంగామా చేసే తరుణం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.