సంతోష్ శోభన్ ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ నవంబర్ 4న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం టీం చేయాల్సినవన్నీ చేశారు. ఇక సినిమా చూడటం చూడకపోవడం అనేది ప్రేక్షకుల చేతిల్లోనే ఉంది. తాజాగా హీరో సంతోష్ శోభన్ అలాగే కమెడియన్ ఓ మల్టిప్లెక్స్ కెళ్ళి అక్కడ జనాలతో ఓ రియాలిటీ వీడియో చేశారు. ఆ వీడియోలో సుదర్శన్ అసలు మన సినిమా గురించి జనాలకు తెలుసా ? పదా చూద్దాం అంటూ సంతోష్ ని తీసుకెళ్తాడు. ముందు ఈ హీరో తెలుసా ? అనే ప్రశ్నకి చాలా మంది సమాదానం చెప్పలేకపోయారు. ఇక ఈ హీరో నుండి రాబోయే సినిమా తెలుసా ? అని అడిగితే దానికి చాలా మంది నో అంటూ ఆన్సర్ ఇచ్చారు.
అయితే ఆ వీడియోలో కమెడియన్ సుదర్శన్ మన సినిమాకి ఫస్ట్ డే జనాలు రారు కదా అనగానే హీరో సంతోష్ శోభన్ ఎందుకు రారు అంటూ కోపంగా రియాక్ట్ అవుతాడు. వెంటనే సుదర్శన్ నువ్వే మైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా ? బుకింగ్స్ ఓపెన్ చేయగానే అందరూ బుక్ చేసేసుకోవడానికి అంటూ రియాలిటీ చెప్తూ పంచ్ వేస్తాడు. ఇది ప్రమోషన్స్ కోసం టీం ప్లాన్ చేసిన వీడియో అయినప్పటికీ ఇందులో సుదర్శన్ మాత్రం చాలా రియాలిటీ గా విషయం చెప్పేశాడు.
ప్రస్తుతం సంతోష్ శోభన్ లైక్ షేర్ సబ్ స్క్రైబ్ బుకింగ్స్ చూస్తుంటే సుదర్శన్ చెప్పిందే జరిగింది. ఈ సినిమా ఎక్కడా పెద్దగా టికెట్లు తెగట్లేదు. పోనియ్ మిగతా సినిమాలకు ఏమైనా బుకింగ్స్ బాగున్నాయా అనే అవి కూడా కష్టంగానే ఉన్నాయి. సో సంతోష్ శోభన్ హిట్ టాక్ తెచ్చుకుంటే ఓ మోస్తరు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ ఓటీటీ హీరో అనిపించుకున్న ఈ యంగ్ హీరో మరి ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ సాదిస్తాడో చూడాల్సిందే.
This post was last modified on November 3, 2022 9:37 am
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి…
సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…
గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన గ్రేట్ డైరెక్టర్లలో ఒకడు. కాక్క కాక్క, ఏమాయ చేసావె,…
ప్రభుత్వం తరఫున పనులు పూర్తి కావాలంటే రోజులు వారాలే కాదు.. నెలలు సంవత్సరాల సమయం కూడా పడుతుంది. అనేక మంది…
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…