తాజాగా షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పఠాన్ టీజర్ సోషల్ మీడియాలో మంచి హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్ కు ఇది సంతృప్తినిచ్చినప్పటికీ మిగిలిన జనాలకు మాత్రం బోలెడు అనుమానాలు కలిగించేసింది. టెర్రిఫిక్ అనిపించే యాక్షన్ విజువల్స్, బాద్షాని చాలా ఏళ్ళుగా చూడని వయొలెంట్ క్యారెక్టర్ కొంచెం కొత్తగానే ఉన్నాయి కానీ గతంలో చూసిన ఫీలింగే కలిగించడంతో పాటు విఎఫ్ఎక్స్ కు సంబంధించిన కొన్ని లోపాలు స్లో మోషన్ లో చూసుకుంటే బాగా హై లైట్ అవుతున్నాయి. సరిగ్గా ఇక్కడే ప్రభాస్ ఫ్యాన్స్ ఎంట్రీ ఇస్తున్నారు
సాహో ట్రైలర్ వచ్చినప్పుడు మిక్స్డ్ రియాక్షన్స్ కన్నా పాజిటివ్ ఫీడ్ బ్యాకే ఎక్కువగా వచ్చింది. ఎంతగా అంటే ఇదే షారుఖ్ దర్శకుడు సుజిత్ కి పర్సనల్ గా ఫోన్ చేసి అభినందించేంతని ముంబై మీడియాలో వార్త కూడా వచ్చింది. వన్ అఫ్ ది బెస్ట్ ట్రైలర్ కట్ గా సాహోకి ప్రశంసలు దక్కిన మాట వాస్తవం. కాకపోతే అసలు సినిమాలో మ్యాటర్ తక్కువగా ఉండటంతో ఫలితం తేడా కొట్టింది కానీ ఒకవేళ కంటెంట్ కనక కరెక్ట్ గా కనెక్ట్ అయ్యుంటే బాహుబలిని దాటేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ పఠాన్ కు అంత భీభత్సమైన రెస్పాన్స్ అయితే రాలేదు.
అనవసరంగా అప్పట్లో సాహోని తిట్టామే అని ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా దీనికి మద్దతు ఇవ్వడం గమనార్హం. రెండు పోల్చుకుని చూస్తే ప్రభాస్ దే చాలా రెట్లు మెరుగ్గా కనిపించడం అతిశయోక్తి కాదు. మరి ఇంత గ్యాప్ తర్వాత భారీ బిల్డప్ తో వస్తున్న పఠాన్ కింగ్ ఖాన్ కి ఎలాంటి కంబ్యాక్ ఇస్తుందో చూడాలి. జనవరిలో ఇదొచ్చేదాకా బాలీవుడ్ బాక్సాఫీస్ చప్పగానే ఉండనుంది. డిసెంబర్ చివరి వారంలో సర్కస్ వస్తే సరి. లేదంటే అంతే సంగతులు. సంక్రాంతి ఆది పురుష్ డ్రాప్ అయ్యాక దాన్ని స్థానాన్ని భర్తీ చేసే స్థాయిలో ఏ హిందీ సినిమా సిద్ధంగా లేదు. సో షారుఖ్ ఒకడే దిక్కవుతాడు,
This post was last modified on November 3, 2022 9:30 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…