ఒకప్పట్లా దక్షిణాది సినిమాలను బాలీవుడ్ తారలు తక్కువగా చూసే పరిస్థితి లేదు. అక్కడ స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న వాళ్లను సౌత్ సినిమాల కోసం అడిగితే గొంతెమ్మ కోర్కెలు కోరడం, సౌత్ సినిమాల్లో తాము నటించడమేంటి అన్నట్లు చూడడం ఉండేది. కానీ ఇప్పుడు హిందీ సినిమాలను మించి డిమాండ్ తెచ్చుకున్న సౌత్ చిత్రాల్లో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్లు వెనుకంజ వేసే పరిస్థితి లేదు.
దీపికా పదుకొనే, కియారా అద్వానీ, దిశా పఠాని లాంటి టాప్ హీరోయిన్లు సౌత్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్‌ను సైతం తెలుగులో నటింపజేయడానికి కొంత కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ రూపొందించనున్న కొత్త చిత్రంలో హీరోయిన్ పాత్రకు ఆమె పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు కాబట్టి దీనిపై క్లారిటీ రావట్లేదు.
ఈలోపు తన కొత్త చిత్రం మిలి ప్రమోషన్లలో భాగంగా తన టీంతో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది జాన్వి. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆమెకు ఎన్టీఆర్ సినిమాలో నటించే విషయమై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె బదులిస్తూ.. ఇప్పటికే చాలాసార్లు చెప్పా. ఎన్టీఆర్‌ను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఎన్టీఆర్ ఒక లెజెండ్. అతడితో కలిసి నటించాలని నాకూ ఉంది అని చెప్పింది.
సౌత్ ఇండస్ట్రీ అంటే తనకు చాలా ఇష్టమని, ఇక్కడ నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని కూడా జాన్వి పేర్కొంది. తెలుగులో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశారట, ఏదైనా స్పెషల్ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నారా అని జాన్విని ఓ విలేకరి ప్రశ్నించగా.. దానికి ఆమె తండ్రి బోనీ కపూర్ బదులిచ్చారు. ఆ విషయాలు మాట్లాడ్డానికి ఇది సరైన వేదిక కాదని సమాధానం దాటవేశారు. మిలి సినిమా విషయానికి వస్తే ఇది మలయాళ హిట్ మూవీ హెలెన్‌కు రీమేక్. హిందీలో ఈ చిత్రాన్ని మత్తుకుట్టి జేవియర్ రూపొందించగా.. బోనీకపూర్ నిర్మించాడు.
This post was last modified on November 3, 2022 6:57 am
వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…
ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…
వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్న సమంత త్వరలో మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది. జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు…
ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…
ఏ రాష్ట్రంలో అయినా... ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…