ఈ వారం బాక్సాఫీస్ దండయాత్రకు పది సినిమాల దాకా రెడీ అవుతున్నాయి. అందులో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నవి కొన్నే. అందులో కాస్త ఎక్కువ హైప్ తెచ్చుకున్న చిత్రం ఊర్వశివో రాక్షసివో. హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అల్లు శిరీష్‌ను హీరోగా పెట్టి అతడి తండ్రి అల్లు అరవింద్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇంతకుముందు కళ్యాణ్ దేవ్ హీరోగా విజేత అనే సినిమా తీసిన రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. ఓ తమిళ చిత్రానికి రీమేక్‌గా చెబుతున్న ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అను ఇమ్మాన్యుయెల్ అనడంలో సందేహం లేదు. నిజానికి ఆమె మీద టాలీవుడ్‌లో ఐరెన్ లెగ్ ముద్ర పడిపోయింది. తన సినిమాలు చాలా వరకు ఫ్లాపులు కావడమే అందుక్కారణం. అలాంటి హీరోయిన్ని హిట్టు కోసం ఎదురు చూస్తున్న శిరీష్ పక్కన హీరోయిన్‌గా తీసుకోవడం ఆశ్చర్యమే.
కానీ ఇప్పుడు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అనునే అవుతోంది. ఆమెతో శిరీష్ చేసిన లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్లే సినిమాకు హైప్ తెచ్చాయి. ప్రోమోల్లో అవే హైలైట్ అయ్యాయి. యూత్ ఈ సినిమా పట్ల ఆకర్షితులై థియేటర్లకు వెళ్లేందుకు సిద్ధపడుతోంది ప్రధానంగా ఇందులో అనుతో ముడిపడ్డ హాట్ హాట్ సీన్లు, పాటల కోసమే.
ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకు ఆమె అందాలే పెట్టుబడి. కొన్ని నెలల ముందు వరకు అసలు వార్తల్లోనే లేని సినిమా ఇప్పుడు ఓ మోస్తరు బజ్‌తో రిలీజవుతోందంటే హాట్ హాట్ ప్రోమోలే కారణం. కానీ కేవలం అవి సినిమా పట్ల కుర్రాళ్లను ఆకర్షితుల్ని చేస్తాయి కానీ.. సినిమాను నిలబెట్టాల్సింది మాత్రం కథాకథనాలే. మరి క్వాలిటీకి పేరుపడ్డ గీతా ఆర్ట్స్ సంస్థ ఈ విషయంలో ప్రేక్షకులను ఏమేర మెప్పిస్తుందో చూడాలి. ఈ శుక్రవారమే ఊర్వశివో రాక్షసివో థియేటర్లలోకి దిగుతోంది.
This post was last modified on November 3, 2022 6:56 am
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…