చాన్నాళ్ల తర్వాత సమంత నటించిన ఫుల్ లెంగ్త్ మూవీ ఒకటి థియేటర్లలోకి దిగబోతోంది. అది లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడం విశేషం. ఈ ఉపోద్ఘాతం ‘యశోద’ గురించే అని ఈపాటికే అర్థమై ఉంటుంది. తెలుగులో ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను థియేటర్లకు పుల్ చేయగల సామర్థ్యం ఉన్న అతి కొద్దిమంది హీరోయిన్లలో సమంత ఒకరు.
‘యశోద’కు అతి పెద్ద బలం ఆమే అనడంలో సందేహం లేదు. గతంలో ‘ఓ బేబీ’, ‘యు టర్న్’ చిత్రాలతో సమంత సత్తా అందరికీ తెలిసింది. అందుకే కొంచెం పెద్ద బడ్జెట్టే పెట్టి శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందించాడు. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా సమంత పాపులరే కాబట్టి ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర పెద్ద సక్సెస్ కొడతామని చిత్ర బృందం ధీమాగా ఉంది. టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడం ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.
ఐతే అన్నీ ఉన్నా కానీ.. రిలీజ్ దగ్గర పడేసరికి సమంత ప్రమోషన్లు అందుబాటులో లేకుండా పోవడం సినిమాకు పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఈ రోజుల్లో సినిమాకు హైప్ పెంచడంలో ప్రి రిలీజ్ ప్రమోషన్లు చాలా కీలకం. అందులోనూ ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రమోషన్ మరింత అవసరం. పైగా తన సినిమాలను సమంత ప్రమోట్ చేసే తీరు వేరుగా ఉంటుంది. ఆమె మీడియా ముందుకు వస్తే అందరూ అటు వైపు చూస్తారు. పైగా గత ఏడాది కాలంలో సమంత వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పుల వల్ల తను మీడియా ముందుకు వస్తే క్యూరియాసిటీ ఇంకా పెరుగుతుంది. ఆ ఉత్సాహంతోనే అందరూ సామ్ కోసం ఎదురు చూస్తుంటే.. ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది.
ఇప్పటికప్పుడు వెంటనే కోలుకుని ఉత్సాహంగా ప్రమోషన్లలో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. విడుదలకు వారం రోజులే ఉండగా.. సమంత ఆసుపత్రిలో ఉండడం చిత్ర బృందాన్ని కలవరపెడుతోంది. మరి ప్రమోషన్ లేకుండా కేవలం కంటెంట్‌తో, సమంతకున్న ఆకర్షణతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
This post was last modified on November 2, 2022 7:11 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…