జీరో వచ్చి మూడేళ్లు దాటింది. కింగ్ షారుఖ్ ఖాన్ ని తెరమీద చూసి అంత గ్యాప్ రావడంతో ఫ్యాన్స్ ఎదురు చూపులు మాములుగా లేవు. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోని తెరపై చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు. వరస డిజాస్టర్ల దెబ్బకు డిఫెన్స్ లో పడ్డ షారుఖ్ ఆ తర్వాత నెలల పాటు ఖాళీగా ఉన్నాడు. తన పరాజయాలకు కారణాలను విశ్లేషించుకుంటూనే సరైన కాంబినేషన్లు కథల కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. ఇంతకాలానికి పఠాన్ రెడీ అయ్యింది. సుప్రసిద్ధ యష్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ ని ఇవాళ షారుఖ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు
కథ మరీ ఎగ్జైటింగ్ గా ఏమీ లేదు. పఠాన్(షారుఖ్ ఖాన్) అనే గూఢచారి కొన్నేళ్ల పాటు కనిపించకుండా పోతాడు. శత్రవులకు దొరికి చిత్రహింసలు అనుభవించాక అసలు బ్రతికి ఉన్నాడో లేదో అనే అనుమానం వస్తుంది. తీరా చూస్తే సజీవంగా బయటికి వచ్చి విధ్వంస కాండ మొదలుపెడతాడు. ఇతన్ని అడ్డుకోవడానికి ఓ సమాంతర శక్తి(జాన్ అబ్రహం), అండగా నిలించి ఫైట్లు గట్రా చేసేందుకు ఒక డైనమిక్ ప్రియురాలు(దీపికా పదుకునే)ఇలా అంతా ఒక ఫార్ములా ప్రకారం సాగిపోయింది . ఇంతకీ పఠాన్ అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు, అతను ఎంచుకున్న మిషన్ ఏంటనేది సినిమాలో చూడాలి.
దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తన గత చిత్రం వార్ మోడల్ లోనే ఈ పఠాన్ ని డిజైన్ చేశాడు. నమ్మశక్యం కానీ యాక్షన్ ఎపిసోడ్లు, ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే పోరాట దృశ్యాలు ఇందులోనూ పుష్కలంగా దట్టించేశారు. కాకపోతే షారుఖ్ ని ఇంత భీభత్సమైన వయొలెన్స్ సెటప్ లో చూసి చాలా కాలమయ్యింది కాబట్టి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ చాలానే ఉండొచ్చు. విజువల్స్ మాత్రం హై ఎండ్ వేల్యూస్ తో అదరగొట్టేశారు. హిందీతో పాటు తమిళం తెలుగులోనూ ఐమ్యాక్స్ ఫార్మాట్ లో జనవరి 25 రిలీజవుతున్న పఠాన్ షారుఖ్ కోరుకున్న బలమైన కంబ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి
This post was last modified on November 2, 2022 11:34 am
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…