లీవుడ్ బాక్సాఫీస్ మరో వీకెండ్‌కు రెడీ అయింది. కొన్ని వారాలను ఖాళీగా వదిలేసి, మరికొన్ని వారాల్లో ఒకేసారి ఎక్కువ సినిమాలను రిలీజ్ చేయడం చూస్తున్నాం. ఈ వీకెండ్ కూడా రెండో కోవకు చెందినదే. ఈ వారం దాదాపు పది సినిమాల దాకా రిలీజవుతున్నాయి. అందులో అరడజను సినిమాలు రిలీజవుతున్నాయంటే రిలీజవుతున్నాయి అనిపించేవే. అవి నామమాత్రం అనే చెప్పాలి. వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. మిగతా వాటిలో కూడా క్రేజున్న సినిమాలు తక్కువే.
అన్నింట్లోకి అల్లు శిరీష్ సినిమా ఊర్వశివో రాక్షసివో సినిమాకే ఎక్కువ క్రేజ్ ఉంది. అందుకు ప్రధాన కారణం.. ఇది యూత్‌ను ఆకట్టుకునే రొమాంటిక్ టచ్ ఉన్న సినిమా కావడం. ఆ యాంగిల్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఫిక్సయినట్లున్నారు.
గీతా ఆర్ట్స్ ఇమేజ్ గురించి పట్టించుకోకుండా లిప్ లాక్, ఇంటిమేట్ సీన్లతో కూడిన ప్రోమోలు రిలీజ్ చేసి యూత్‌తో సినిమాకు కొంత మేర క్రేజ్ తీసుకురాగలిగారు. ఇక ఈ వారం బరిలో ఉన్న మిగతా చిత్రాల్లో ఊర్వశివో రాక్షసివో తర్వాత కొంత మేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నది లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన చిత్రమిది.
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ సినిమాకు మరీ బజ్ అయితే లేదు. టాక్‌ను బట్టే ఈ సినిమా వైపు జనాలు కదిలేలా ఉన్నారు. నవీన్ చంద్ర మూవీ తగ్గేదేలే, నందు హీరోగా నటించిన బొమ్మ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు బజ్ అంతంతమాత్రమే. ఇవన్నీ కూడా టాక్‌ను బట్టి పుంజుకునే సినిమాలే. ప్రస్తుతానికైతే ఈ వారం సినిమాల్లో కొంత వరకు హైప్ శిరీష్ సినిమాకే ఉంది. సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అల్లు హీరో ఈ అడ్వాంటేజీని ఉపయోగించుకుని ఇప్పుడైనా హిట్ కొడతాడేమో చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 11:09 am
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…